పవన్ రీమేక్ కి సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్

343
Sai Pallavi Demands remuneration 2 crore For Pawan Remake Movie Ayyappanum Koshiyum

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమె నటించి మెప్పించింది. పవన్ రానాలు నటించబోతున్న మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ లో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ , సాయి పల్లవి ని ఎంపిక చేశారట. ప్రస్తుతం ‘వకీల్‌ సాబ్‌’ నటిస్తున్న ఆయన ఆ తర్వాత మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లో నటిస్తారు.

ఈ సినిమా ప్రారంభం కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. కథ ప్రకారం… పవన్‌ది పోలీసాఫీసర్‌ పాత్ర కాగా.. రానా ఎక్స్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో రానా సరసన ఐశ్వర్య రాజేష్‌ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక పవన్ సరసన సాయిపల్లవిని తీసుకోవాలని యూనిట్ అనుకుంటోందట. ఇటీవలే దర్శక నిర్మాతలు సాయిపల్లవిని సంప్రదించగా ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేసిందట.

సాయి పల్లవి ఈ సినిమాలో కేవలం వారం నుండి పది రోజులు మాత్రమే ఉంటది అంట.. అయినప్పటికీ ఆ సన్నివేశాలు కీలకమైనవి కావడంతోనే ఈ బ్యూటీ భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. దాంతో నిర్మాతలు ఆలోచల్లో పడ్డారని తెలుస్తోంది. ఆమెను పారితోషికం విషయంలో ఒప్పించే ప్రయత్నం చేయడంతో పాటు మరో వైపు పవన్ కు సరి జోడీ అమ్మాయిని వెదికే పనిలో కూడా ఉన్నారట.