Sai Pallavi In NTR Devara movie: ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. దీంతో అతని నెక్స్ట్ మూవీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ 30 మూవీ కు ఇప్పటికే దేవర అనే మంచి మాస్ టైటిల్ ని సెట్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. మంచి మాస్ గెటప్ లో ఎన్టీఆర్ ఈ మూవీలో ఫాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు ఎన్టీఆర్ పిక్ చూస్తేనే అర్థమవుతుంది.bఫాస్ట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకుంటున్నా ఈ చిత్రం నుంచి విడుదలైన ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అయింది.
Sai Pallavi In NTR Devara movie: ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ మూవీ కావడంతో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ పై ఫాన్స్ విపరీతంగా రెస్పాండ్ అవుతున్నారు.
గత కొద్దికాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి ఈ చిత్రంలో కీలకపాత్ర లో నటించనున్నట్లు లేటెస్ట్ అప్డేట్. జాన్వీ కపూర్ తో పాటుగా సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి (Sai Pallavi) ఈ మూవీలో కనిపించే అవకాశం ఉంది అన్న న్యూస్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కే కాకుండా అటు సాయి పల్లవి ఫాన్స్ కి కూడా మంచి కిక్ ఇచ్చే న్యూస్. గతంలో ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు వినిపించినప్పటికీ సాయి పల్లవి ఈ చిత్రంలో చేస్తోంది అన్న విషయాన్ని ఆమె టీం కూడా ఖరారు చేయడంతో న్యూస్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

2022లో వచ్చిన గర్గి చిత్రం తర్వాత తిరిగి సాయి పల్లవి ఇంకే సినిమాలో కనిపించలేదు. ఎంతో టాలెంట్ ఉన్న ఈ నేచురల్ బ్యూటీ తిరిగి నటించడం అది కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ పక్కన అవ్వడంతో ఆమె ఫాన్స్ బాగా ఖుష్ అవుతున్నారు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు సైఫ్ మధ్య హాలీవుడ్ రేంజ్ ఫైట్స్ ను ఈ మూవీ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 5 న విడుదల చేయటానికి మూవీ మేకర్ సన్నాహాలు చేస్తున్నారు.