#PSPK27 Cast: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘వకీల్ సాబ్’ షూటింగులో పాల్గొంటున్న ఆయన క్రిష్‌తో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమైనా..కథానాయిక ఎవరు అన్నదానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతో మొదటి హీరోయిన్గా ‘సాహో’ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె కన్ఫార్మ్ చేసింది. మరో హీరోయిన్ కోసం యూనిట్ జల్లెడ పడుతుండగా ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా నిధి అగర్వాల్ పేరు బయటికి వచ్చింది. తాజాగా సాయిపల్లవి పేరు కూడా వినిపిస్తోంది.
జమీందారీ కుటుంబానికి చెందిన యువతి పాత్ర సినిమాకే హైలెట్ నిలుస్తుందని, అందువల్ల సాయిపల్లవి అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ చేయడానికి సాయిపల్లవి ఓకే చెప్పేసిందంటూ సోషల్‌మీడియా ప్రచారం జరుగుతోంది. క్రిష్ ఇప్పటికే ఉప్పెన్ హీరో వైష్ణవ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి పవన్ తో మూవీ షెడ్యూల్ పై పని చేస్తున్నారు. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.