sai Pallavi, Naga Chaitanya Love Story Shooting At Armoor In Nizamabad District

Naga Chaitanya: Love Story Shooting: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలిసి తెలంగాణలోని మారుమూల ప్రాంతాలన్నీ తిరిగేస్తున్నారు. ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలోని బోడకొండ జలపాతం వద్ద సందడి చేశారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో చక్కర్లు కొట్టారు. నాగ‌చైత‌న్య, సాయి ప‌ల్లవి జంట‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’.

షూటింగ్ తిరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో చిత్ర యూనిట్ సందడి చేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో స్థానికలు తమ స్మార్ట్ ఫోన్లలో ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. నవసిద్ధుల గుట్టపై సాయి పల్లవి చేయి పట్టుకుని నాగ చైతన్య పరుగు పెడుతున్న సన్నివేశాన్ని తాజాగా చిత్రీకరించారు.

ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.