Sai Pallavi In Dhanush D51: వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది ఇండస్ట్రీలో. తన అందం అలాగే డాన్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అయితే ఈమధ్య సాయి పల్లవి తెలుగు సినిమాలలో కనిపించడం చాలా తక్కువ అయింది. నాగచైతన్య అలాగే రానా సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా రాలేదు ఇంతవరకు. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ధనుష్ మూవీ లో హీరోయిన్ గా వచ్చినప్పటికీ రిజల్ట్ చేసిందంట.. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సాయి పల్లవి ఎప్పుడు రెమ్యునరేషన్ అలాగే ఇమేజ్ కోసం సినిమాలు చెయ్యదు, తనకి కథ నచ్చితే తప్ప ఆ సినిమాని ఒప్పుకోదు. గతేడాది విరాటపర్వం సినిమాలో నటించిన సాయి పల్లవి గార్గి రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో అభిమానులను అలరించింది. ఆ తర్వాత సాయి పల్లవి స్ట్రైట్ తెలుగు మూవీ లో కనపడలేదు.
ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా D51 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఎంపిక చేశారు. ఈ సినిమాలో మొదట ధనుష్, సాయి పల్లవి కలిసి నటించాల్సి ఉంది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాలలో సాయి పల్లవి హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే అయితే ధనుష్ మూవీ లో కూడా హీరోయిన్గా చేయాల్సిందంట. అయితే ఈ ఆఫర్‌ను సాయి పల్లవి రీసెట్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ధనుష్‌తో ఆల్రెడీ మారి 2లో నటించింది సాయి పల్లవి. ఈ సినిమాలో ‘రౌడీ బేబీ’ పాట సెన్సేషనల్ హిట్ అయింది. కానీ హీరోయిన్ ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ పాత్ర గ్లామర్ గా కనిపించాల్సి ఉందంట అందుకని ఈ ప్రాజెక్టు సాయి పల్లవి ఒప్పుకోలేదని తెలుస్తుంది. సాయి పల్లవి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనుకోదు.. మంచి కథతో సినిమాలు చేయాలని అనుకుంటోంది. అందుకే సాయి పల్లవి సెలెక్ట్ సినిమాలు చేస్తుంది. ఇక సాయి పల్లవి తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ అలాగే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.