వరుణ్ తేజ్ హీరోగా హీరోగా వచ్చిన ఫిదా సినిమాలో సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం జరిగింది. తన అందం అలాగే నటనతో ప్రేక్షకులు ఆకట్టుకునే లాగా చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే సాయి పల్లవి డాన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సాయి పల్లవి ఒక డ్రీమ్ గర్ల్ గా అందరి మనసును దోచిన విషయం తెలిసిందే.
అయితే సాయి పల్లవి కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉండటం మనం గమనించవచ్చు. ప్రస్తుతం కూడా తమిళంలో ఒక సినిమా చేస్తుంది కానీ తెలుగులో తనకు వచ్చిన ఆఫర్స్ ని కూడా కాదంటుందంట. మరి దీని వెనకాల ఎటువంటి కారణం ఉందో తెలియాల్సి ఉంది. అయితే రీసెంట్గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది.
సాయి పల్లవి చిన్నతనం నుండి ఇప్పటివరకు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేదంట.. అయితే దీనిలో ముఖ్యంగా తను విభూది తింటుందని చెప్పుకురాటం జరిగింది… ఇప్పుడు కూడా ఏదైనా బయటికి వెళ్తే తన బ్యాగులో విభూది పెట్టుకుంటుందంట. ఒక మంచి వృక్షం నుండి తయారు చేసిన విభూది ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా ఆమె పేర్కొంది.

ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్.. హీరోయిన్ అయినప్పటికి… ఒక డాక్టర్ అయినప్పటికి కూడా సాయి పల్లవి విభూది తినడం విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవికి ఆధ్యాత్మికతపై ఆసక్తి ఎక్కువ. ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి అమర్ నాథ్ యాత్రకు కూడా వెల్డింగ్ విషయం అందరికీ తెలిసిందే. మరి తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది.