సమీక్ష : అల్లుడు అదుర్స్ – కామెడీ డ్రామా

0
252
Bellamkonda Sai Sreenivas Alludu Adhurs Movie Review

చిత్రం భళారే రేటింగ్ : 2.75/5
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
నిర్మాత‌లు : సంతోష్ శ్రీనివాస్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : చోటా కె నాయుడు
ఎడిట‌ర్‌ : తిమ్మరాజు కె

సంతోష్ శ్రీనివాస్ దర్సకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. రాక్షసుడు సినిమా తర్వాత వస్తున్న సినిమా కావటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :

శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నతనంలోనే వసుంధరా రెడ్డి (అనూ ఇమాన్యుల్)ను ప్రేమించి విఫలం అవుతాడు. అప్పటినుండి అమ్మాయిలకు, ప్రేమకు దూరంగా ఉంటాడు. అయితే పెద్దయ్యాక అతను కౌముది (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే వసుందర చెల్లెలైన కౌముది (నభా నటేష్)- శీను ప్రేమలో పడతారు. ఈ కన్ఫ్యూజింగ్ లవ్ ట్రాక్ వల్ల ఇద్దరు హీరోయిన్ల తండ్రి అయిన నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) ఎలా ఇబ్బంది పడ్డాడు.. తీరా శ్రీను, కౌముదిని ప్రేమలో పడేసే టైంకి అతని జీవితంలోకి గజా (సోనూసూద్) ఎంట్రీ ఇవ్వడంతో దాంతో శ్రీను గోల్ మారుతుంది. తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? అనేదే ‘అల్లుడు అదుర్స్’ కథ.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రాసుకున్న స్టోరీ ఐడియానే వెరీ రెగ్యులర్ గా ఉంది. పైగా ఆ ఐడియాకు తగ్గట్టు ట్రీట్మెంట్ వెరీ వెరీ రెగ్యులర్ అండ్ బోరింగ్ గా సాగింది. ఇక దేవీ శ్రీ బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా నేపధ్య సంగీతం మామూలుగా ఉన్న సీన్‌ని బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమాలాగే చాలా రిచ్‌గా ఉన్నాయి.

రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

సినిమా కథ బాగుంది. కాకపోతే డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ స్లోగా ప్రెజెంట్ చేశాడు. కొన్ని సీన్లు బోరింగ్ గా ఉన్నాయి. దేవిశ్రీ బాణీలు ఆకట్టుకున్నాయి కామెడీ రొటీన్ గా ఉంది. విలన్‌గా భారీ రేంజ్‌లో ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేసినప్పటికీ కథనంలో ఆయన పాత్రను కామెడీతో మిక్స్ చేయడంతో ఆ రోల్ పవర్ తగ్గినట్లుగా అనిపించింది. సెకండ్ ఆఫ్లో సోనూసూద్ హీరోల మధ్య సన్నివేశాలు అలరించాయి. హీరో యాక్టింగ్ లో మెచ్యూరిటీ చూపించాడు. నభా, అను ఇమ్మాన్యుయేల్ అందం, నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సినిమాలో కొత్తదనం లేకపోవడం, అక్కడక్కడ కొన్ని దృశ్యాలు పాత సినిమాలను గుర్తుకుచేయడం, అలాగే బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా రిజల్ట్ ను దెబ్బ తీసింది.

REVIEW OVERVIEW
Chitrambhalare Desk
Previous articleAlludu Adhurs Movie Review- Just for fun
Next articleరామ్ రెడ్ మూవీ రివ్యూ..!