Sai Sudha case filed against police inspector murali krishna on shyam k naidu cheating case

సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడుపై (shyam k naidu) నటి శ్రీ సుధ (Sai Sudha) లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత శ్యామ్ కె.నాయుడు బెయిల్‌పై బయటకు రావడంతో కొత్త ఆరోపణ తెరపైకి తెచ్చి పోలీస్ ఇన్స్‌పెక్టర్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది శ్రీ సుధ. నటి శ్రీసుధ తాజాగా ఎస్సార్‌నగర్‌ మాజీ సీఐ మురళీ కృష్ణపై ఏసీబీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ తన దగ్గర డబ్బులు తీసుకోవటంతో పాటు శ్యామ్‌ కే నాయుడిని అరెస్ట్ చేయకపోవటం, కోర్టులో రాజీ కుదర్చుకున్నట్టుగా నకిలీ పత్రాలను సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కోంది.

ఎస్ఆర్ నగర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ 5 లక్షల లంచం ఇచ్చానని చెప్పిన శ్రీ సుధ.. అతను ఆ డబ్బు తీసుకున్నాక తగిన విధంగా న్యాయం చేయలేదని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఈ కేసులో శ్యామ్‌ కె.నాయుడును అరెస్టు చేయకపోవడంతో పాటు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్‌ సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సీఐతో మాట్లాడిన సాక్షాలను, పలు కీలక ఆధారాలను ఆమె ఏసీబీకి సమర్పించింది. శ్రీ సుధ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు తాజాగా సీఐ మురళి కృష్ణపై కేసు నమోదు చేశారు.

కంప్లయింట్‌ తీసుకున్న పోలీసులు ప్రాధమిక విచారణ తరువాత మురళీ కృష్ణపై కేసు నమోదు చేశారు. చాలా రోజులుగా నలుగుతున్న ఈ కేసు సీఐపై ఫిర్యాదుతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన శ్రీ సుధ, తనను శ్యామ్‌ కే నాయుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చాలా రోజుల క్రితం ఫిర్యాదు చేసింది.