Sai Teja Prathi Roju Pandage Movie Review and Rating
Sai Teja Prathi Roju Pandage Movie Review and Rating

సినిమా: ప్రతిరోజూ పండగే
రేటింగ్: 3/5
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు..
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మారుతి
మ్యూజిక్: థమన్ ఎస్

కెరీర్ ఆరంభంలో బాగానే నిలబడినా తర్వాత సరైన హిట్టు చిత్రాలు పడడం లేదు.అలాగే రీసెంట్ గా వచ్చిన ‘చిత్రలహరి’ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆ ఫామ్ ని కంటిన్యూ చేయడం కోసం కంప్లీట్ ఎంటర్ టైనర్స్ తీసే డైరెక్టర్ మారుతి తో కలిసి చేసిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. రాశీ ఖన్నా హీరోయిన్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ ఈరోజే విడుదల అయ్యింది. మరి ఈ సినిమా సాయి తేజ్ కి మరో హిట్ ని ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

రాజమండ్రిలో సెటిల్ అయిన సత్యరాజ్ కి నలుగురు సంతానం. అందులో ముగ్గురు యుఎస్ లో సెటిల్ అయితే మరొక్కరు ఇండియాలో సెటిల్ అవుతారు. ఇక కథలోకి వెళ్లినట్టయితే సత్యరాజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడతారు అయితే తన ఆఖరి రోజుల్లో గడిపే కొన్ని క్షణాలు అయినా సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్) ఇండియాలోకి రాజమండ్రిలోని తన ఊరికి బలదేరుతాడు. ఈ బిజీగా మరియు చంచలమైన జీవితాలలో తప్పిపోయిన మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యత మరియు అందమైన క్షణాలు మిగతా కథలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సంగీతం
కామెడీ
బలమైన ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :

ఊహించదగ్గ కథనం

టెక్నికల్ క్రూ & పెర్ఫార్మెన్స్:

మొదట, క్లీన్ ఫ్యామిలీ సినిమా కోసం ప్రయత్నించినందుకు దర్శకుడు మారుతిని ప్రశంసించాలి. కానీ అతను విషయాలు ఆకర్షణీయంగా ఉండటానికి తాజా దృశ్యాలు మరియు చక్కని స్క్రీన్ ప్లే రాయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎటువంటి మలుపులు లేకుండా అతని ఫ్లాట్ కథనం ఈ చిత్రానికి పెద్ద మైనస్.

కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ సరే, జయకుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అతిపెద్ద ప్లుసే పాయింట్. ఈ చిత్రాన్ని రంగురంగుల రీతిలో ప్రదర్శించడానికి ప్రయత్నించినందున అతని పని ఈ చిత్రంలో ఉత్తమమైనది.

ఎస్.ఎస్.తమన్ సంగీతం బాగుంది, అన్ని పాటలు తెరపై బాగున్నాయి మరియు అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అదే ఉంది. ఈ పరిమిత బడ్జెట్ అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.

సాయి ధరం తేజ్ స్టైలిష్ మేక్ఓవర్ బాగుంది మరియు కీ ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన మేపించాడు. సత్యరాజ్ ఈ చిత్రానికి ప్రధాన రోల్. సీనియర్ నటుడు తన పాత్రను చక్కగా చేసాడు మరియు భావోద్వేగ సన్నివేశాల్లో బాగా వచాయీ.

చిత్రం యొక్క రెండవ భాగంలో ప్రదర్శించబడిన ప్రధాన భావోద్వేగాలు మంచి రీతిలో అమలు చేయబడతాయి అలాగే కుటుంబ ప్రేక్షకులకు బాగా నచుతాయీ. హీరోయిన్ రాషి ఖన్నా తెరపై చాలా అందంగా ఉంది మరియు టిక్ టోక్ సెలబ్రిటీగా ఇచ్చిన సరదా పాత్రలో ఉత్సాహంగా ఉంటుంది. ఈ జంట మధ్య ప్రేమ సన్నివేశాలన్నీ బాగున్నాయి అలాగే వారి కెమిస్ట్రీ బాగుంది.

రావు రమేష్ మరియు ప్రఖ్యాత కళాకారులందరూ ఇచ్చిన ఉద్దేశపూర్వక పాత్రలో భాగానే చేసారు.

విశ్లేషణ :

తన సినిమాకు వచ్చిన ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడమే పనిగా పెట్టుకున్న మారుతి ఎప్పటిలానే ప్రతిరోజు పండగే సినిమాతో కూడా తన పంథా కొనసాగించాడు. సినిమాకు ఎంచుకున్న కథ ఎమోషనల్ గా ఉన్నా దాన్ని నడిపించిన తీరు సరదాగా సాగింది. చాలా సీరియస్ కథను ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడం అనేది మారుతి ఒక్కడివల్లే అయ్యింది.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో కితకితలు పెట్టించిన మారుతి సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కొద్దిగా ఎమోషనల్ గా సాగించాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఎప్పటిలానే అద్భుతంగా నటించాడు. రాశీ ఖన్నా తన అందంతో నటనతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ట్రాక్స్ లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ సహా ఇతర కీలకమైన ఎమోషన్స్ సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా చేశాడు. ఇక ప్రీ క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ తో అదరగొట్టాడు. మరో కీలక పాత్రలో కనిపించిన సత్య రాజ్ మంచి ఎనర్జిటిక్ గా మాత్రమే కాకుండా ఎమోషనల్ గా అద్భుతమైన నటన కనబర్చారు. రావు రమేష్ ఈ సారి కామెడీ సీన్స్ లో చించేశాడు.

దర్శకుడు రొటిన్ కథనే తోనే సినిమాను లాక్కొచ్చారు. ఇక కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. ఎమోషన్స్ కూడా ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. అయినా కూడా మారుతి తన గ్రిప్ కోల్పోలేదని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్.. కామెడీ ఇలా అన్నిటిని కవర్ చేస్తూ సినిమా చివర్లో మాత్రం ఎమోషనల్ గా సాగింది. సినిమా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంది. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు యూత్ ఆడియెన్స్ మెప్పించే అంశాలు ఉన్నాయి. ఓవరాల్ గా సాయి ధరం తేజ్ మరోసారి ప్రేక్షకులను మెప్పించే సినిమాతో వచ్చాడు.