మార్చి26న సైనా నెహ్వాల్ బయోపిక్

128
saina-nehwal-biopic-release-date-fixed
saina-nehwal-biopic-release-date-fixed

ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలను సినిమాల రూపంలో అందరికీ చేరువ చేస్తున్నారు. దర్శకులు వారి సినిమాలతో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. అందులో భాగంగా రూపొందిన సినిమాల్లో ఇప్పటికి కొన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని విడుదలకు సిద్దమవుతున్నాయి.

 

వాటిలో భారత బ్యాడ్‌మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ఒకటి. ఇందులో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అమోల్ గుప్త దర్శకత్వంలో భూషన్ కుమార్, కృష్ణన్ కుమార్, సుజయ్ జై రాజ్, రాషేష్ షా సంయుక్తంగా నిర్మించారు. రూపొందుతోంది. నేడు ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ సహా రిలీజ్‌ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు.

 

 

ఈ సినిమా మార్చి26న విడుదల కానుంది. ఈ సినిమా సైనా నెహ్వాల్ జీవితంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలు కూడా ఉన్నాయంట.