Venkatesh upcoming movie news, venkatesh next Saindhav shooting update, Saindhav teaser release date, Saindhav cast crew, Saindhav release date, Venkatesh latest news
విక్టరీ వెంకటేష్ సైంధవ్ (Saindhav) సినిమాని శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సైంధవ్ సినిమా షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించడం జరిగింది. వెంకటేష్ సైంధవ్ సినిమాని మొట్టమొదటిసారిగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు, సైంధవ్ సినిమా షూటింగ్ (Saindhav Shooting) ఫైనల్ షెడ్యూల్ కోసం అని శ్రీలంకలో సెప్టెంబర్ 10 నుంచి మొదలు పెట్టడం జరిగింది.. అయితే ఇప్పుడు ఐదు రోజుల మినహా టోటల్ షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. శ్రీలంక షెడ్యూల్లో ఒక పాటతో పాటు క్లైమాక్స్ సంబంధించిన సన్నివేశాలను కూడా షూట్ చేశారు.
వెంకటేష్ ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ చాలా కాలంగా సైంధవ్ టీజర్ (Saindhav Teaser) గురించి ఎదురుచూస్తున్నారు. మూవీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చే ఆలోచనలో ఉన్నారంట మేకర్స్.
అయితే దీనికి కారణాలు లేకపోలేదు సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ప్రబాస్ సలార్ (Salaar) మూవీ పోస్ట్ పోన్ అవటం జరిగింది.. కానీ ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ఎంత వరకు ప్రకటించలేదు.. లేటెస్ట్ గా సోషల్ మీడియా ప్రకారం సలార్ (Salaar New Release Date) మూవీ ని డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ కి సమాచారం అందినట్టు న్యూస్ వైరల్ అవుతుంది. . అయితే దీని మీద ఇంతవరకు అధికార ప్రకటన రాలేదు.. అదే కనుక జరిగితే సైంధవ్ సినిమా రిలీజ్ డేట్ ని మార్చే విధంగా మేకర్స్ కూడా సన్నహాలు చేస్తున్నారంట. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.