Sairam Shankar Resound Telugu Movie Shooting details, Cast Crew, Release date, Teaser

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘143’, ‘డేంజర్’, ‘బంపరాఫర్’, ‘రోమియో’ వంటి చిత్రాల్లో సాయిరామ్ శంకర్ హీరోగా నటించారు. అలాగే, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశారు. ఒక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఈ చిత్రానికి ‘రీసౌండ్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శకునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సాయిరామ్ శంక‌ర్ స‌ర‌స‌న నాయిక‌గా రాశీ సింగ్ న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం పునఃప్రారంభ‌మైంది. ఇప్పటివ‌ర‌కూ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తయింది. తాజాగా ప్రారంభ‌మైన షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు.

‘రీసౌండ్’ మూవీని సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, స్వీకర్ అగ‌స్తి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఉపేంద్ర ఎడిటర్. నబా స్టంట్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. పోసాని కృష్ణముర‌ళి, అర‌వింద్ కృష్ణ, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వనాథ్‌, ‘అదుర్స్’ ర‌ఘు, పింకీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.