Salaar Trailer release date, Salaar Ceasefire trailer, Salaar Part 1 Trailer, Salaar movie promotions, Prabhas, Shruthi Haasan, Prabhas upcoming movie news.
Salaar: Part 1 – Ceasefire Trailer: KGF సిరీస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ డ్రామా సలార్ పార్ట్ 1 మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ప్రభాస్ అలాగే శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాని మొదటిగా సెప్టెంబర్ 28న విడుదల చేయాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవటంతో రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ మేకర్స్ సలార్ ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు అంటూ ఎదురు చూస్తున్నారు.
Salaar: Part 1 – Ceasefire Trailer: సలార్ మూవీ ట్రైలర్ ని అలాగే ప్రమోషన్స్ ని నవంబర్ మూడో వారం నుండి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ తన మోకాలు చికిత్స కోసం ఇటలీ వెళ్ళిన విషయం తెలిసిందే. నవంబర్ 8న ప్రభాస్ హైదరాబాద్ కి తిరిగి రావడంతో సలార్ మూవీ ప్రమోషన్ మొదలు పెడతారని అందరూ ఆశిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు, సలార్ ట్రైలర్ నవంబర్ చివరి వారంలో అలాగే సినిమా ప్రమోషన్ ని మూడో వారంలో సాంగ్ ని విడుదల చేసి మొదలు పెడతారు అన్నట్టు తెలుస్తుంది.
అలాగే ప్రమోషన్ విషయానికి వచ్చేటప్పటికి ప్రశాంత్ నీల్ బస్ టూర్ అలాగే ప్రెస్ మీట్ ఎక్కువ పెట్టే అవకాశం లేదు అన్నట్టు సమాచారం అయితే వినపడుతుంది. దర్శకుడు కేజిఎఫ్ సిరీస్ కి ఎలా ప్రమోట్ చేశారో అదే విధంగా ఈ సినిమా కూడా ప్రమోషన్స్ ఉంటాయని.. ప్రస్తుతానికి అయితే ఎటువంటి టూర్స్ ప్లాన్ చేయలేదు అంటూ ఫిలింనగర్లో టాక్ వినబడుతుంది.
కేజిఎఫ్ కూడా ప్రశాంత్ కంటెంట్ నమ్ముకుని సినిమాని ప్రమోషన్స్ లేకుండా విడుదల చేయడం జరిగింది.. ఇక్కడ కూడా అదే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎక్కడ నిరుత్సాహ పడకుండా సినిమాలో కంటెంట్ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం.
సలార్ టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.. దానితోపాటు టీజర్ లో కేజిఎఫ్ సిరీస్ కూడా లింక్ ఉన్నట్టు అందరూ భావిస్తున్నారు.. మరి ఈ సినిమా రెండు భాగాలు విడుదలైన తర్వాత కేజిఎఫ్ సిరీస్ కి లింక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, భువన గౌడ కీలకమైన పాత్రలో చేస్తున్నారు.. సలార్ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ వారు తరికెక్కిస్తున్నారు.