సలార్ షూటింగ్ కోసం 12 భారీ సెట్లు…!!

Prabhas Salaar Shooting Update: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం ప్రభాస్ ఒక్కసారి తెగిపోయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ తో సహా ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయారు. అయితే కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కి బాధ్యతలు పెరిగినట్టు తెలుస్తుంది. కష్టం రాజు చిన్న కర్మ తన సొంత ఊరు అయినా మొగల్తూరులో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభాస్.

ఇక ప్రభాస్ (Prabhas Next) రాబోయే సినిమా విషయానికి వస్తే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఆదిపురుష్ సినిమా ఒక్కటే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ (Salaar Shooting) మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక్క సీన్ కి ఒక్కో సెట్ చేయాల్సి వచ్చిందట.

సలార్ (Salaar) సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒకటి కాదు, రెండు కాదు 12 సెట్ లు వేసారట. సలార్ మూవీ షూటింగ్ (Salaar Shooting) చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. కృష్ణం రాజు గారు మరణంతో ప్రభాస్ అన్ని షూటింగులకి దూరమయ్యారు.

ఇప్పుడు ఈ సెట్ లు అన్నీ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. షూటింగ్ జరిపినా జరపకున్నా సెట్ లకు రోజుల లెక్కన డబ్బులు కడుతూనే వుండాలి. దీంతో సినిమా బడ్జెట్ కూడా పెరుగుతుందని ప్రొడ్యూసర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని గమనించిన ప్రభాస్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించి కంప్లీట్ చేద్దామని ప్రొడ్యూసర్స్ కి మాట ఇచ్చినట్లు సినీ సర్కిల్ లో న్యూస్ వైరల్ అవుతుంది. సలార్ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో చేస్తున్నారు. సలార్ షూటింగ్ సంబంధించిన ఈ ఆర్టికల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles