Prabhas Salaar Teaser Release Date: దర్శకుడు రాజమౌళి తర్వాత అంత తక్కువ టైంలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాపులర్ తెచ్చుకున్న ఇంకో దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు. యాష్ నటించిన కే జి ఎఫ్ సిరీస్ తో నేషనల్ లెవెల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో సలార్ అనే భారీ బడ్జెట్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. సలార్ సినిమాని అన్ని భాషల్లో సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
Prabhas Salaar Teaser Release Date: ప్రభాస్ కూడా వరుస పెట్టి ఫ్యాన్ ఇండియా సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ కూడా అన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి ఎదురు చూడటం సరిపోతుంది. మొన్నటిదాకా ఆది పురుషుపై అంచనాలు పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు సలార్ మూవీ పై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆది పురుష అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ సత్తా చాటారు.
కోల్డ్ మైన్ నేపథ్యంలో తరాకెక్కుతున్న సలార్ (Salaar) మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ సలార్ టీజర్ (Salaar Teaser) సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.
ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు సలార్ టీజర్ కు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ టీజర్ కట్ ఫైనల్ పనులు మొదలైనట్టు.. అలాగే చెన్నైలో ఒక డబ్బింగ్ థియేటర్లో ఈ టీజర్ కు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలాగే తదుపరి కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

అందుకు ప్రశాంత్ నీల్.. స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటున్నారనే బజ్ కూడా విపరీతంగా వినిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి నుంచి సలార్ సినిమాకు సంబంధించిన స్టోరీని ఎక్కడ లీక్ కాకుండా జాగ్రత్త పడటమే కాకుండా సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా చాలా జాగ్రత్తగా విడుదల చేయడం జరిగింది.
దీనితో ఈ సినిమాపై ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి అంచనాలు భారీగానే పెరిగాయి. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా చేస్తుంది. సినిమా మేకర్స్ సలార్ టీజర్ ని జూలై 7న విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్ విడుదల తేదీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే చేస్తారంట.