Prabhas Salaar Part 1 Trailer Release Date: ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్ తమిళ వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా సాలార్. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న సాలార్ సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్లు మేకర్స్ సాలార్ టీజర్ విడుదలతో ప్రకటించటం జరిగింది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దాటి రికార్డుల వర్షం సృష్టిస్తుంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్నారు.
Prabhas Salaar Part 1 Trailer Release Date: అతి తక్కువ సమయంలోనే సాలార్ పార్ట్ 1 టీజర్ 100 మిలియన్లు రికార్డు సృష్టించటంతో మూవీ మేకర్స్ ఈరోజు ప్రెస్ నోట్ విడుదల చేయటంతో పాటు సాలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వటం జరిగింది. ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ సాలార్ సంబంధించిన ట్రైలర్ ని ఆగస్టు నెలలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ప్రభాస్ అలాగే ప్రశాంత్ నేను సినిమా మొదలైన దగ్గర నుండి, ఈ సినిమా KGF సిరీస్ కు సాగింపు ఉంటుంది అంటూ ఊహాగానాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. అయితే టీజర్ విడుదలైన తర్వాత KGF 3 అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు.

“ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు! సలార్ టీజర్ సృష్టించిన ప్రభంజనంలో మీరంతా భాగస్వాములై, మాపై మీరు చూపిన అపారమైన ప్రేమ, మద్దతు, అభిమానానికి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాము.
భారతీయ సినిమా పరాక్రమానికి ఇదొక ప్రతీక. పాన్ ఇండియా సినిమా సలార్ టీజర్ 100 మిలియన్ వ్యూస్‌ను సాధించి దూసుకెళ్తోంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ మద్దతు మా అభిరుచిని మరింత పెంచి అసామాన్యమైన సినిమాను మీకు అందించాలనే మా కోరిక మరింత బలపడింది.” అంటూ ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.