Salaar will cross RRR & Baahubali USA day 1 collection: ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సాలార్ సిరీస్ అయిన సాలార్ – సీజ్ ఫైర్ ఇప్పటి వరకు భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే పోస్టర్ ఈ సినిమాపై భారీగానే అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమాని యూఎస్ఏ లో రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ 28 విడుదలవుతున్న సలార్ పార్ట్ వన్ ట్రైలర్ ని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Salaar will cross RRR & Baahubali USA day 1 collection: ఇప్పుడు అందరి చూపు సాలార్ యొక్క USA విడుదలపైనే ఉంది, ఎందుకంటే ఈ చిత్రం USAలో ఇప్పటిదాకా విడుదలైన తెలుగు సినిమాలు కంటే ఎక్కువ థియేటర్లో విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో USA కలెక్షన్స్ బ్రేక్ అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్స్ + డే 1 టాలీవుడ్ టాప్ 3 సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. RRR సినిమా 5.5M మొదటి రోజు కలెక్ట్ చేయగా..బాహుబలి 2 – 4.6M.. బాహుబలి – 2.5M బాక్సాఫీస్ వద్ద రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
బాహుబలి సిరీస్ చాలా సంవత్సరాల క్రితం విడుదలైంది, కానీ ఇప్పటికీ ఈ సినిమా రికార్డులు ఇంకా చెక్కుచెదరలేదు ఎందుకంటే మరే ఇతర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాటలేకపోయింది. బాహుబలి సిరీస్ అలాగే RRR యొక్క ఓపెనింగ్స్‌ను బ్రేక్ చేయడానికి ఇప్పుడు సాలార్ రెడీగా ఉంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర సినిమాలు ఇప్పటికీ బాహుబలిని తాకలేదు, అయితే సాలార్ ఈ రికార్డులను బద్దలు కొట్టడానికి ఖచ్చితంగా అధిక అవకాశాలను కలిగి ఉంటుంది. ఈ చిత్రం USAలో రికార్డ్ స్థాయిలో స్క్రీన్‌లలో విడుదలవుతోంది మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే హీరో ప్రభాస్‌కు ఇతర భాషలలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే అన్ని భాషల్లో విపరీతమైన హంగామా చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.