NTR ‘Janatha Garage’ బాలీవుడ్ రీమేక్ హీరో ఎవరో తెలుసా

0
1865
Salman khan lead role in NTR Janatha Garage Hindi remake

NTR ‘Janatha Garage’: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో చెప్పనవసరం లేదు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘జనతా గ్యారేజ్’ మూవీ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (salman khan) చేస్తున్నారని టాక్ వినపడుతుంది.

ఈ మూవీ కోసం ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారని, 2022 లో ఈ ప్రాజెక్ట్ మొదలవనుందని ప్రచారం జరుగుతోంది. హిందీ రీమేక్‌ని తెరకెక్కించే దర్శకుడు..తదితర విషయాలను త్వరలరో వెల్లడించనున్నారని తెలుస్తోంది.

‘జనతా గ్యారేజ్’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా అక్కినేని సమంత – నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పుడు ఇదే సినిమా రీమేక్‌ను సల్మాన్ చేయబోతుండగా, ఆయన సొంత నిర్మాణ సంస్థ భాగ స్వామ్యంతో మైత్రీ వారు నిర్మించనున్నట్టు సమాచారం.