బాలీవుడ్లో పూజకు బంపరాఫర్!

Salman Khan to romance Pooja Hegde in 'Kabhi Eid Kabhi
Salman Khan to romance Pooja Hegde in 'Kabhi Eid Kabhi

(Salman Khan to romance Pooja Hegde in ‘Kabhi Eid Kabhi.. Salman Khan has finally found the leading lady for his upcoming film ‘Kabhi Eid Kabhi Diwali’.)ఇప్పటివరకు పలు హిట్ సినిమాలు నమోదు చేసుకున్న పూజ హెగ్డే, అలా వైకుంఠపురంలో చిత్రం తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ 20వ చిత్రం, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బుట్ట బొమ్మ క్రేజ్ ఎలా ఉందంటే శిల్ప శెట్టి లాంటి అగ్ర హీరోయిన్ ఈ చిత్రంలోని పాటలకు ఫిదా అయి తాజగా స్టెప్పులేశారు. ఈ చిత్రం కి అంతగా ఆదరణ ఏర్పడింది. అయితే అల్లు అర్జున్ తో పాటుగా ఈ చిత్రానికి పూజ కు చాల పేరు తీసుకువచ్చింది. తాజాగా పూజ బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఫర్హద్ సంజీ తెరకెక్కిస్తున్న ‘కబీ ఈద్ కబీ దీవాళీ’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. సల్మాన్‌తో నటించే అవకాశం రావడంతో పూజ ఆనందానికి అవధుల్లేవు. సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా కథ కూడా అందిస్తున్నాడు. 2021 ఈద్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రాధే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధే’ సినిమాలో దిశా పటాని, జాకీ ష్రాఫ్, రణదీప్ హూడా నటిస్తున్నారు. ఈ ఏడాది ఈద్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.