‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన సామ్

0
204
Samantha Akkineni dubs for web series The Family Man Season 2

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ మంచి ఆదరణని దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి రెట్టింపైంది.

తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన సమంత.. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. మరోవైపు సమంత వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. గత యేడాది నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి.

కాగా ఈ వెబ్ సిరీస్ లో సమంత పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. దీంతో సామ్ పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Previous articleAllu Arjun Break Prabhas and Mahesh All Time Record
Next articleSamantha Akkineni dubs for web series The Family Man Season 2