samantha akkineni enter into the fashion business name saaki world

నటి సమంత అక్కినేని (Samantha Akkineni) సినిమాల్లో నటించడంతో పాటు వివిధ వ్యాపారాలు (Business) మొదలు పెట్టింది. ఇప్పటికే ఆమె జూబ్లీహిల్స్ లో తన స్నేహితులతో కలిసి ఏక్కం అనే ప్రీ స్కూల్ బిజినెస్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పడు సమంత వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దానికి సాకీ అనే పేరు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన కసరత్తు అంతా లాక్ డౌన్ సమయంలోనే పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

సాకి వరల్డ్ పేరుతో తాను వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్టు సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాకి వరల్డ్ ను ప్రారంభించాలని గత కొంతకాలంగా అనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. తనకు ఫ్యాషన్ పై ఉన్న ప్రేమను సాకి వరల్డ్ తెలియజేస్తుందని ఆమె పేర్కొన్నారు.

తన దుస్తుల బ్రాండ్ అందరికీ అందుబాటులో ఉంటుందని, సరసమైనదని ఆమె చెప్పుకొచ్చింది. సాకీ కల నిజం చేసుకోవడానికి సమంతా మరియు ఆమె బృందం చేసిన కృషి యొక్క చిన్న వీడియోను నటి పోస్ట్ చేసింది. ఈ కొత్త వ్యాపారంలో ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.