samantha akkineni guest role in Naga chaitanya venky mama movie
samantha akkineni guest role in Naga chaitanya venky mama movie

మొదటి సారిగా స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేశ్ ‘కలియుగపాండవులు’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు. విక్టరీ తన పేరు ముందు పెట్టుకున్న వెంకటేష్ కెరీర్ ప్రారంభంలో యాక్షన్ తరహా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఫ్యామిలీ పాత్రల్లో నటించి కడుపుబ్బా నవ్వించారు.

ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు, వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించారు. ఈ సినిమాలో మరో నటి సమంత మెరవనుందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట. ఆ మద్య చైతూ-సమంత కలిసి నటించిన మజిలీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా వుంచారట. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ వార్తను బయటికి వదిలినట్టుగా తెలుస్తోంది. ఈ వార్త ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ.. ఫిలిమ్ వర్గాల్లో టాక్ మాత్రం నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.