Samantha Akkineni inviting Naga Chaitanya's fan after seeing his adventure
Samantha Akkineni inviting Naga Chaitanya's fan after seeing his adventure

అభిమానం.. ఎటువంటి స్టార్ ని అయినా కట్టిపడేస్తుంది. తమ హీరోల కోసం ఏదైనా చేసేయడానికి వెనుకాడని అభిమానులు ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ అభిమానం చూసి మనకు కూడా అబ్బా.. ఆ హీరోని ఎంతగా అభిమానించాడురా అతను అని అనుకోకతప్పదు. అలాంటి అభిమానులను చూసి ముచ్చటపడ్డ సెలెబ్రిటీలు వారిని ప్రత్యేకంగా కలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య సమంత ఓ అభిమాని ప్రేమకు మంత్రముగ్ధులు అయ్యారు.

నవంబర్‌ 23న నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఓ అభిమాని మోకాళ్ల మీద సింహాచలం ఆలయ మెట్లు ఎక్కాడు. ఇంతకూ ఆ అభిమాని ఎవరంటే బొబ్బిలికి చెందిన సాగర్‌. అతడికి నాగ చైతన్య అంటే ఎంతో ఇష్టం.. ఆ అభిమానాన్ని తనదైన శైలిలో చూపించాడు నాగచైతన్య. తన అభిమాన హీరో బాగుండాలని సింహాచలం కొండను మోకాళ్ల మీద ఎక్కాడు. అలా ఎక్కుతుండగా తీసిన వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు సాగర్‌. ఇది విపరీతంగా వైరల్ అయింది. దీన్ని చూసి నాగచైతన్య, సమంతలు కూడా షాక్ అయ్యారు.

`సాగర్‌.. ఏం చెప్పాలో అర్థం కావటంలేదు. మాటలు రావటం లేదు. నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమకు కృతజ్ఞతలు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నేను మరింత గొప్ప పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది` అంటూ పోస్టు పెట్టాడు. ఇక తన భర్త మీద అతడు చూపించిన అభిమానానికి మంత్రముగ్ధురాలైన సమంత తమను కలవాలని ఆ అభిమానిని కోరింది. `మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. నేను నమ్మలేకపోతున్నా. మాటలు రావటం లేదు. మమ్మల్ని కలవండి` అని ట్వీట్ చేసింది. ఏది ఏమైనా అక్కినేని అభిమానులు మాత్రం ఈ వీడియో చూసి తెగ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు.