Samantha Akkineni ,Oh Baby Film
Samantha Akkineni ,Oh Baby Film

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో కొరియన్ మూవీ మిస్ గ్రానీ ని తెలుగులో లో ఓ బేబీ ని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా వర్క్ మొత్తం పూర్తయిపోయింది.జులై 5 న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు సురేష్ బాబు.కాకపోతే ఆ కాంపౌండ్ లో ఈ మధ్య కొత్తగా ఒక ఆచారం ఏర్పడింది.అదేంటంటే సినిమా పూర్తయిపోయిన తరువాత సినిమా జనాలకు ఆ సినిమా చూపించి వాళ్ళతో పబ్లిసిటీ చేయించడం.అలా ఆ అలవాటు ప్రకారం ఒక 200 మందికి ఈ సినిమా చూపించారట.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే అంతా ఈ సినిమాలో కామెడీ ని ఎంజాయ్ చేసినా ఫైనల్ గా మాత్రం క్లయిమాక్స్ లోని ఎమోషన్ కి కనెక్ట్ అయ్యారట.దీంతో తాము తీసిన సినిమా కేవలం కామెడీ మూవీ కాదు అని అర్ధమయ్యింది టీమ్ కి.ఇదేదో సునీల్ సినిమా అప్పలరాజు లో పాయింట్ లా ఉన్నా కూడా ఇది నిజం.వాళ్ళ కన్నీళ్లు చూసి టీమ్ అంతా తాము తీసిన సినిమాలో కంటెంట్ ఏంటి అనేది అర్ధం చేసుకున్నారు.మరి ప్రేక్షకులు దేనికి కనెక్ట్ అవుతారో,బేబీ కి ఎలాంటి రిజల్ట్ అందిస్తారో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]