ఓ బేబి ట్రైలర్ : ఫన్ + ఎమోషన్

124
Samantha Akkineni, Oh Baby Official Trailer, Film News,
Samantha Akkineni, Oh Baby Official Trailer, Film News,

 

కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ గా తెరకెక్కిన సినిమా ఓ..బేబీ.సమంత టైటిల్ రోల్ లో నటిస్తుంది.ఈ సినిమా లైన్ కాస్త విచిత్రంగా ఉంటుంది.70 ఏళ్ల బామ్మ 24 సంవత్సరాల అమ్మాయిగా మారితే ఎలా ఉంటుంది అనే క్రేజీ థాట్ ని కామెడీ మిక్స్ చేసి చెప్పారు.ఈ సినిమా టీజర్ తోనే కన్ఫ్యూషన్ లేకుండా ఫన్నీ గా ఉండేలా సినిమా కాన్సెప్ట్ కన్వే చేసిన టీమ్ ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

ట్రైలర్ లో కాన్సెప్ట్ లో ఉన్న కొత్తదనం అడుగడుగునా ఫన్ జనరేట్ చేసింది.సమంత కూడా చాలా నేచురల్ గా,మెచూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.ఈమధ్య కామెడీ,ఎమోషన్ మిక్స్ అయిన ఇంపాక్ట్ ఫుల్ పాత్రలు చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు.ఈ హీరోయిన్ సెంట్రిక్ సినిమాలో హీరో నాగశౌర్య కూడా తన క్యారెక్టర్ ని తాను ఫుల్ ప్లెడ్జెడ్ గా చేసాడు.ఈ సినిమాలో ఎమోషన్ కంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకున్నారు.అది వర్క్ అవుట్ అయితే థియేటర్ లో బేబీ అల్లరికి అప్లాజ్ గ్యారంటీ.

టెక్నికల్ గా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంది.రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ,మిక్కీ.జె.మేయర్ మ్యూజిక్ కూడా బావుంది అనిపిస్తున్నాయి.లక్ష్మి భూపాల రాసిన మాటలు పేలాయి.అలా మొదలయ్యింది తరువాత మళ్ళీ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న నందిని రెడ్డి ఈ సినిమాని డెడికేషన్ తో తెరకెక్కించింది అనిపిస్తుంది.ఓవర్ ఆల్ గా సమంత పెర్ఫార్మెన్స్ మెయిన్ ఎస్సెట్ గా తెరకెక్కిన ఓ బేబీ మంచి విజయాన్ని అందుకునే అవకాశాలే ఉన్నాయి.జులై 5 ప్రేక్షకులముందుకు వస్తుంది ఓ బేబి.