నేను అలా అనలేదు!- సమంత

Samantha Akkineni Opens Up About Her Retirement Rumours
Samantha Akkineni Opens Up About Her Retirement Rumours

(Samantha Akkineni Opens Up About Her Retirement Rumours.. Says She Was Misquoted. Samantha Akkineni is one of the most popular actresses in the Telugu..)జాను చిత్ర ప్రచారంలో భాగంగా నటి సమంత మాట్లాడుతూ మరో రెండు మూడేళ్లలో రిటైర్మెంట్ అంటూ అక్కినేని కోడలు సమంత అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. `జాను` ప్రమోషన్స్ లో సామ్ వ్యాఖ్య వైరల్ అయ్యింది. కథానాయిక అంటే కెరీర్ స్పాన్ చాలా తక్కువ.. కానీ తాను చాలా లక్కీగా పదేళ్లకు పైగా కెరీర్ సాగించానని తర్వలో విరమిస్తానని తెలిపింది. దానికి తగ్గట్టు సమంత కొత్త యాక్టివిటీస్ సందేహానికి తావిచ్చాయి.

ఈ ప్రచారం మితి మీరడంతో సమంత స్పందిస్తూ.. ‘ఓహో నేను చెప్పింది మీకు అలా అర్థం అయ్యిందా ‘ అని ప్రశ్నించింది. నిజానికి తాను మూడు ఏళ్ల తరువాత సినిమాకు గుడ్‌బై చెబుతానని చెప్పలేదని. పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని ఈ సినిమా ప్రపంచం సవాల్‌తో కూడుకున్నదని అన్నట్టు చెప్పింది. ఇక్కడ నటీమణులు ఎక్కువ కాలం కొనసాగడం కష్టం అని చెప్పానని తెలిపింది. అలా అవకాశాలు లేక తాను నటించలేకపోయినా, ఏదోవిధంగా సినిమాలోనే కొనసాగుతానని చెప్పానని వివరించింది.

ఎంతో కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్ లో పెళ్లి అనంతరం మార్కెట్లో సత్తా చాటుతోంది. నాగార్జున కోడలిగా.. చైతూ భార్యగా తన ఇమేజ్ కి తగ్గ కథల్ని ఎంచుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. అలాగే చైతూ కి జోడీగా నటిస్తూ బ్యాలెన్సింగ్ గా వెళుతున్న సంగతి తెలిసిందే.