Samantha back to Kushi Promotions: సమంత అలాగే విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాని సెప్టెంబర్ 1న విడుదల చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఖుషి సాంగ్స్, టీజర్ అలాగే పోస్టర్లు సినిమాపై భారీగానే అంచనాలు పెంచేసాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Samantha back to Kushi Promotions: ఈ సినిమా కొన్ని నెలల ముందే విడుదల కావాల్సి ఉండగా సమంత ఆరోగ్యపరంగా షూటింగు లేట్ అవ్వాల్సి వచ్చింది. . మేకర్స్ సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్ అయితే లేదు కాకపోతే ఖుషి సినిమా ప్రమోషన్స్ లో సమంత హాజరు అవుతుందా లేదా అనే సందేహం అయితే అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఖుషి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ సినిమాలకి గ్యాప్ తీసుకోబోతున్నట్టు ప్రకటించింది .
అంతేకాకుండా సమంత తన ఆరోగ్య విషయంలో విదేశాల్లో చికిత్స తీసుకోవటానికి వెళ్తున్నట్టు కూడా సమాచారమైతే తెలిసింది. అయితే ఇప్పుడు బాలీలో చికిత్స తీసుకుంటున్న సమంత ఖుషి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనటానికి చెన్నై తిరిగి వచ్చినట్టు సినిమా వర్గాల వారు చెబుతున్నారు.
ఇటీవల సమంత తన సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులతో అలాగే చిన్మయి ఇంటి వద్ద సందడి చేసిన కొన్ని వీడియోలను పంచుకున్న విషయం తెలిసిందే. ఖుషి కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాగే రెండు మూడు సినిమా ఇంటర్వ్యూ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని ఖుషి టీమ్ నుండి అందుతున్న సమాచారం.

ఖుషి సినిమాపై అటు సమంత అలాగే విజయ్ దేవరకొండ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. సమంత ఖుషి ప్రమోషన్స్ లోనే కాకుండా సిటాడెల్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సమంత ఖుషి సినిమా విడుదల ముందు విదేశాల నుండి రావడం పట్ల ఖుషి మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.