సమంతను వరించిన మరో అవార్డు.!!

Samantha: నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత చాలా కృంగిపోయి చనిపోతానని అనుకున్నానని సమంత సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్ని చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే అల్లు అర్జున్ పుష్పా సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఈ రోజు రిలీజ్ అవుతుంది.

సినిమాలతో పాటు ఓటీటీల్లోనూ నటిస్తూ అదరగొడుతోంది. భిన్నమైన పాత్రలు చేస్తూ.. తనని తప్ప వేరే వారు ఎవరిని ఆ పాత్రలో ఊహించుకోలేనంతగా నటిస్తూ అభిమానులను మెప్పిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల అయిన ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ – 2’ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత నటించిన విషయం తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్ లో సమంత రాజీ అనే పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా రాజీ పాత్ర చేసిన సమంత కు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫేర్ ప్రతినిధులు అధికారింగా ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు. అయితే ఫిల్మ్ ఫేర్ ట్వీట్ కు సమంత థాంక్స్ అంటూ రీ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

Samantha bags Best Actress Filmfare OTT Award for The Family Man
Samantha bags Best Actress Filmfare OTT Award for The Family Man

ఇప్పటివరకు సామ్ నటించిన ఏమాయ చేసావే.. ఈగ, నీతానే ఎన్ వసంతం చిత్రాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది. ఇక నార్త్ లో తొలి ఓటీటీ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది సమంత.

 

Related Articles

Telugu Articles

Movie Articles