samantha hosted bigg boss 4 telugu dusshera special episode trp rating

Bigg Boss Samantha: మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో ఇప్పుడు నాలుగో సీజన్లో కూడా సూపర్బ్ గా రన్ అవుతుంది. ఇటీవలే పాపులర్ షో బిగ్ బాస్ తెరపై అక్కినేని కోడలు సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. దసరా పండగ స్పెషల్ ఎపిసోడ్‌లో చిన్నితెరపై తనదైన స్టైల్‌లో మ్యాజిక్ చేస్తూ మామ నాగార్జున లేని లోటును భర్తీ చేసింది. సమంత ఎపిసోడ్‌కి తక్కువ రేటింగ్ వచ్చిందని తప్పుడు ప్రచారాలు పుట్టించడమే గాక, బిగ్ బాస్ షో అనేది అక్కినేని ఫ్యామిలీ షోగా మారిందని విమర్శలు గుప్పించారు కొందరు నెటిజన్లు.

కానీ తాజాగా వచ్చిన రేటింగ్ ప్రకారంగా చూస్తే.. ఆ ఎపిసోడ్‌లో సమంత సత్తా చాటిందని స్పష్టంగా తెలుస్తోంది. దసరా రోజు టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ 4కు 11.4 టీవి రేటింగ్ వచ్చిందని అఫీషియల్ సమాచారం బయటకొచ్చింది. మొత్తానికి మాత్రం మామయ్య ప్లేస్ లో వచ్చి స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను సమంత ఏ స్థాయిలో మెస్మరైజ్ చేసిందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని చెప్పాలి. దీంతో ఇది చుసిన సామ్ అభిమానులు తమ అభిమాన తారను అంతలా విమర్శించిన వారంతా నోరెళ్లబెట్టాల్సిందే.. ఇదీ సమంత సత్తా! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.