అర్హ డైలాగ్స్ అదరగొట్టేసింది : బ‌న్నీ డాట‌ర్ పై స‌మంత‌ కామెంట్..!

0
81
Samantha is head over heels for Allu Arjun's daughter Arha on the first day of 'Shakuntalam' shooting

Allu Arha: Samantha: అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందిస్తోన్న ‘Shaakuntalam’ సినిమాతో అర్హ నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఇటీవల వచ్చిన క‌రోనా సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం కరోనా త‌గ్గుముకం ప‌ట్టిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.

శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో అర్హ (Arha) నటించబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇందులో అర్హ పాత్ర ఎలా ఉండబోతోందనే దాని గురించి తాజాగా సమంత (Samantha) చెప్పుకొచ్చింది. ఫస్ట్ టేక్ లోనే అర్హ అన్ని డైలాగులను చకచకా చెప్పేస్తుంద‌ని పేర్కొంది. ఆమె డైలాగులు సినిమాలో సూపర్ గా ఉండబోతున్నాయి అంటూ పేర్కొంది.

ఇక స‌మంత పోస్ట్ పై అల్లుఅర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా స్పందించింది. అర్హ‌కు సపోర్ట్ చేస్తున్నందుకు స‌మంత‌కు స్నేహారెడ్డి థాంక్స్ చెప్పింది. బన్నీ సైతం ఈ పోస్ట్ పై స్పందిస్తూ.. ‘థాంక్యూ సో మచ్’ అంటూ చెప్పుకొచ్చారు.