‘పుష్ప’లో సమంత ఐటమ్‌ సాంగ్‌ అదిరింది..!!

Samantha Special Item Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప (Pushpa). పుష్ప సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని డిసెంబర్ 17న రిలీజ్ చేయటానికి అన్ని విధాలా సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగా సమంత ఐటమ్ సాంగ్ (Samantha) ని ఈ రోజు రిలీజ్ చేశారు.

పుష్ప సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అలాగే సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడు సమంతా (Samantha Song) స్పెషల్ ఐటెం సాంగ్ ఊ అంటావా, ఊ ఊ అంటావా (Oo Antava..Oo Oo Antava song) ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సాంగులో సమంత (Samantha) చాలా అందంగా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు.

బోల్డ్ లుక్ లో సమంత (Samantha) చాలా హాట్ గా ఉందని చెప్పాలి. సాంగులో సమంతా (Samantha) డాన్స్ అదరగొట్టిన ని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బెస్ట్ మాస్ సాంగ్ అని చెప్పవచ్చు. అలాగే డి.ఎస్.పి ఈ సినిమాకి చాలా కొత్తగా సాంగ్స్ ని మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ న్ని ఇచ్చాడు.

Samantha item song Oo Antava..Oo Oo Antava out now
Samantha item song Oo Antava..Oo Oo Antava out now

ఊ అంటావా, ఊ ఊ అంటావా (Oo Antava..Oo Oo Antava) అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే.

మలయాళ నటుడు ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles