Homeసినిమా వార్తలువిజయ్ దేవరకొండ & సమంత ఖుషీ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదలకు సిద్ధం..!!

విజయ్ దేవరకొండ & సమంత ఖుషీ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదలకు సిద్ధం..!!

Kushi movie First song Release Date:డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సమంత (Samantha) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ‘నా రోజా నువ్వే’ ఫస్ట్ సాంగ్ విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ సాంగ్ సంబంధించిన పోస్టర్ను కూడా ఈరోజు విడుదల చేయటం జరిగింది.

Kushi movie First song Release Date: ఈ నెల 9న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda Birthday) బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది. విజయ్, సమంత (Samantha) మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్ అనేలా ఆ ఇద్దరి ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇదో స్వచ్ఛమైన మనసుల కథ అని తెలిసేలా చుట్టూ తెల్లని మంచు కొండలు, తెల్లని పావురాల మధ్య మనసంతా స్వేచ్ఛా విహంగంలా మారింది అనేలా విజయ్ సోలో ఫోటో సైతం చాలా ఇంప్రెసివ్ గా ఉంది.

Kushi movie First song Release Date confirmed

ఈ పోస్టర్ చూడగానే ఈ మూవీ ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో అని అర్థం చేసుకోవచ్చు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ‘నా రోజా నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాబోయే ఈ పాటతో మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా ఈ లిరికల్ సాంగ్ ఉంటుంది. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY