kushi movie story: మహానటి సినిమా తర్వాత సమంత అలాగే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మళ్ళీ కలిసి నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఖుషి సాంగ్స్ అలాగే టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
Samantha Kushi Story: ఖుషి సినిమా మొదటి సాంగు దాదాపు 20 మిల్లీళ్ల వ్యూస్ పైనే వచ్చాయి కానీ సమంత అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తప్పించి మిగతా వాళ్ళు ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపటం లేదు అనేది తెలుస్తుంది. రీసెంట్ గా విడుదలైన ఖుషి ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది చూపించిన ప్రేమ కథ నే మళ్లీ చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయటం చూసాము. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయమైతే తెలుస్తుంది.
ఖుషి సినిమా ఆల్మోస్ట్ ఒకప్పటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సఖి కథే (Sakhi story) అంటున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి ట్రైలర్ విడుదలైన తర్వాత సఖి చిత్రం కూడా వారిద్దరూ ఒకరినొకరు ఎలా ప్రేమించుకున్నారు అలాగే ఇంట్లో వారు ఇద్దరి ప్రేమని ఒప్పుకోరు. ఖుషీ సినిమా ట్రైలర్ కూడా అలాగే అనిపిస్తోంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని, ఇంట్లో ఒప్పుకోకుంటే, పెళ్లి చేసుకుని విడిగా జీవిస్తే, కాపురంలో గొడవలు జరుగుతాయని, చివరికి అదే జరుగుతుందని ట్రైలర్‌లోనే చూపించారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది చూసిన ప్రేక్షకులు అలాగే మూవీ లవర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఖుషి సినిమాని దర్శకత్వం వహిస్తున్న శివ నిర్వాణ కూడా మణిరత్నం నా ఫేవరేట్ అని అయన ఇన్‌స్పిరేషన్ తోనే ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పాడు. దానితోపాటు విడుదలైన మొదటి సాంగ్ కూడా మణిరత్నం సినిమాలు అన్నీ కలిపి ఒక సాంగ్ లాగా క్రియేట్ చేయడం జరిగింది.

దీనితో అందరూ ఆ సినిమా స్టోరీ నే తీసుకొని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు మార్పులు చేశారేమో అని కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. అయితే ఇది తెలుసుకున్న సినిమా పిఆర్ టీం ఇది ఫేక్ న్యూస్ అంటూ వైరల్ అవుతున్న వీడియో కి కామెంట్ చేయడం జరిగింది. మరి ఈ ఖుషి సినిమా సఖి స్టోరీ ఒకటేనా కాదా అనేది విడుదలైన తర్వాత తెలుస్తుంది.