Samantha net worth Details:సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ వస్తూ పోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ని నిలబెట్టుకుంటారు వారిలో ఒకరు సమంత. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత (Samantha) ఆ తరువాత టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ వస్తున్నప్పటికీ సమంతా మాత్రం తన పాపులారిటీని ఇంకా పెంచుకుంది. ప్రస్తుతం సమంతా కి సంబంధించిన ఆస్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Samantha net worth Details: హీరోయిన్ సమంత తెలుగు తో పాటు తమిళం అలాగే హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది సమంత (Samantha). అంతేకాకుండా ఇప్పుడు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటించడంతో మరింత పాపులారిటీ పెరిగింది అలాగే ఈ వెబ్ సిరీస్ గాను సమంత బాగానే రెమినరేషన్ తీసుకుంటుంది అంట. ఇప్పుడు సమంత ఆస్తుల విలువ (net worth) తెలిస్తే ఆశ్చర్యపోతారంటూ చాలామంది విశ్లేషిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే, సమంత (Samantha) కెరియర్ స్టార్ట్ దగ్గర్నుంచి ఇప్పటివరకు తెలుగు తమిళ్ కన్నడ అలాగే హిందీ సినిమాల్లో నటించింది. వీటితోపాటు చాలా బ్రాండ్ కి ప్రమోషన్స్ కూడా చేస్తుంది. అన్ని కలుపుకొని ప్రస్తుతం సమంత ఆస్తి 120 కోట్ల (120 crores) పైనే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సెలబ్రిటీ నెట్ వర్త్ డాట్ కాం విశ్లేషణ ప్రకారం సమంత ఆస్తుల (Samantha net worth) విలువ 100 కోట్లని (10 Million) వివరించారు. సమంత ఒక్కొక్క సినిమాకి 2 కోట్ల దగ్గర్నుంచి 4కోట్ల వరకు తీసుకుంటుంది. అలాగే వీటితో పాటు ప్రకటనలతోను భారీగా ఆర్జిస్తోంది.
ఇక సమంతా కి ఎక్కడెక్కడ ఆస్తులు (Samantha Properties) ఉన్నాయో వివరాల్లోకి వెళితే, హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో దాదాపు 25 కోట్ల చేసే భారీ ఇల్లు ఉంది. అలాగే ముంబైలో 15 కోట్లు చేసే ఇల్లు.. 2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్- రేంజ్ రోవర్ రూ. 1.46 కోట్ల విలువైన పోర్షే కేమాన్ జిటిఎస్ సహా అనేక విలాసవంతమైన కార్లను సమంత దగ్గర ఉన్నాయి. అలాగే వీటితో పాటు సాకి అనే ఫ్యాషన్ లేబుల్ ద్వారాను బాగానే లాభాలు తీసుకుంటుంది.