Samantha celebrity-based talk show gets a name – Sam Jam

Samantha Sam Jam Talk Show: హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ‘ఆహా’. సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా మాధ్యమం.. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమమే ‘సామ్‌జామ్‌’.ఈ టాక్‌షోకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం టాక్‌ షో మాత్రమే కాదు.. సమాజంలోని సమస్య గురించి ప్రశ్నించడం. టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడం వంటి డిఫరెంట్‌ స్టైల్‌ను ఇందులో మనం చూడొచ్చు. దేశంలో టాప్‌ ప్రోగ్రామ్స్‌ అయిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి, కాఫీ విత్‌ కరణ్‌ వటి వాటిని డిజైన్‌ చేసిన టాప్ టీమ్‌ ‘సామ్‌జామ్‌’ను డిజైన్‌ చేశారు.నవంబర్‌ 13 నుండి ప్రతి వారం ప్రసారం కానున్న ఈ షోలో మెగాస్టార్‌ చిరంజీవి, స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌, క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్స్‌ తమన్నా, రష్మిక మందన్నా, క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ వంటి స్టార్స్‌ సందడి చేయనున్నారు. శుక్రవారం ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన టీజర్‌తో పాటు, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….

ఆహా అధినేతల్లో ఒకరు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ “మార్చి 18 తర్వాత నేను ప్రపంచాన్ని చూడలేదు. మధ్యలో ఆహాకు సంబంధించి రెండు ప్రెస్‌మీట్స జరిగిన మా ఇంట్లోనే జరిగాయి. ఇవాళే నేను బయటకు వచ్చాను. ఆహాను ఫిబ్రవరిలో లాంచ్‌ చేశాం. ఇంత పెద్ద మాధ్యమాన్ని లాంచ్‌ చేసినప్పుడు మాకొక నిర్దిష్టమైన ప్లాన్‌ ఉండాలిగా. ప్లాన్‌ చేసుకుంటున్న సమయంలో కోవిడ్‌ వచ్చేసింది. ఆహాను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తే మన సమంతగారితో ఓ పెద్ద టాక్‌షో చేయాలి. దానికి ఎంతో మంది సినీ ఆర్టిస్టులు, స్పోర్ట్స్‌ ఆర్టిస్టులు వచ్చి పాల్గొంటే పెద్ద షో అవుతుందిగా అనుకున్నాం.

ఇది నార్మల్‌ షో కాదు. ఇక ఆహా గురించి చెప్పాలంటే ఈ కోవిడ్‌ టైమ్‌లోనూ 18 మిలియన్‌ మంది వ్యూవర్స్‌ ఆల్‌రెడీ రీచ్‌ అయ్యాం. దీన్ని నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లే ప్రణాళికలను దీపావళి రోజున వివరిస్తాం. ఈ దీపావళి నుండి వచ్చే దీపావళి వరకు ఆహాలో ప్రోగ్రామ్స్‌తో మిమ్మల్ని ఆహా అనిపిస్తాం. ఇక ఈ టాక్‌ షో విషయానికి వస్తే.. దీని పేరు ‘సామ్‌ జామ్‌’. ఇది ఎంత పెద్ద షో అవుతుంది. దక్షిణాదిలోనే ఇంత పెద్ద షో జరగలేదని విషయం.. షో జరిగితే కానీ తెలియదు. ఇతర టాక్‌ షోలకు భిన్నమైన టాక్‌ షో ఇది. ఆహా మాధ్యమానికి ఇది తొలి మెట్టు. నందినీ రెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు. ఇది కేవలం మా అవసరాల రిఫ్లెక్ట్‌ చేసే షో కాదు.. సమంత పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే షోగా డిజైన్‌ చేశారు. ఇందులో సామాజిక కారణం, కొందరి జీవితాలను మార్చడానికి అవసరమైన విషయాలుంటాయనేలా ఈ షోను డిజైన్‌ చేశారు” అన్నారు.

 Samantha celebrity-based talk show gets a name – Sam Jam

డైరెక్టర్‌ నందినీ రెడ్డి మాట్లాడుతూ “నేను ఢీలాంటి రియాలిటీ షో చేశాను. కానీ పీసీఆర్‌ రూంలోకి ఇంత వరకు వెళ్లనే లేదు. కానీ తొలిసారి ఈ షో కోసం ఆ రూమ్‌లో కూర్చుకున్నాను. నేను ఎక్కువగా సినిమాలే చేశాను. కానీ ఈ షోను చేసేటప్పుడు చాలా సమస్యలు ఫేస్‌ చేశాను. యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌. సామ్‌ జామ్‌ టీం.. కంట్రీలోనే పెద్ద షోస్‌ను నిర్వహించారు. కాఫీ విత్‌ కరణ్‌, కౌన్‌బనేగా కరోడ్‌పతి వంటి షోస్‌ చేసిన టీమ్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇదేదో టాక్‌షోనో, ఎంటర్‌టైన్‌మెంట్‌ షోనో కాదు.. అంతకంటే చాలా పెద్ద షో” అన్నారు.

Samantha celebrity-based talk show gets a name – Sam Jam

స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని మాట్లాడుతూ “చాలారోజుల తర్వాత ఇంట్లో ఇంత సమయం గడిపే సమయం దక్కింది. ప్రజలు చాలా సమస్యలు ఫేస్‌ చేశారు. కానీ ఎవరినీ తప్పు పట్టలేం. మనతో పాటు మన చుట్టు ఉన్నవాళ్లు, వాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఓ గ్రేట్‌ లెర్నింగ్‌ ఎక్స్పీరియెన్స్‌ అనొచ్చు. సామ్‌జామ్‌ షో చాలా పెద్ద ఛాలెంజ్‌. దీంతో పోల్చితే యాక్టింగ్‌ చాలా సులభమనిపిస్తుంది. హోస్టింగ్‌ సులభం కాదు. నాకు ఓ ఎక్స్‌టెన్షన్‌లాంటి షో అని భావిస్తున్నాను. ఇది అందరికీ సంతోషాన్ని అందించే షో అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఈ షో చేయడం ముఖ్యమనిపించడంతో ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకున్నాను. ఇది టాక్‌ షో కాదు, సమాజంలో సమస్యల గురించి మాట్లాడుతాం. టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తాం. అరవింద్‌గారితో కలిసి పనిచేయడం హ్యాపీగా, స్పెషల్‌గా అనిపిస్తుంది. నేను మాధ్యమం గురించి ఆలోచించలేదు. ఓ ఛాలెంజింగ్‌గా అనిపించడంతో షో చేయడానికి ఒప్పుకున్నాను” అన్నారు.

 Samantha celebrity-based talk show gets a name – Sam Jam

షో డిజైనర్‌ ఫజీల మాట్లాడుతూ “ఈ షోను అందరూ ఇష్టపడతారు. ఎలాంటి అంచనాలుంటాయో అర్థం చేసుకోగలను. అది ఓ రకమైన ఒత్తిడిని క్రియేట్ చేసింది. సమంత మాత్రమే ఈ షోను అందంగా చేయగలదని భావించి ఆమెను ఒప్పించాం” అన్నారు.