Samantha Oh Baby Film Review
Samantha Oh Baby Film Review

విడుదల తేదీ : జూలై 05, 2019
రేటింగ్ : 3.25/5
నటీనటులు : సమంత,నాగ శౌర్య,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్,తేజ సజ్జా
దర్శకత్వం : బి వి నందిని రెడ్డి
నిర్మాత‌లు : సురేష్ బాబు,సునీతా తాటి,టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్.
సంగీతం : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్ : జునైద్ సిద్ధికి

[INSERT_ELEMENTOR id=”3574″]

చాలా సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తున్న సమంత రుత్ ప్రభు…అక్కినేని సమంత గా మారాక మరింత సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తుంది.ఈ మధ్య కాలంలో సమంత చేసిన ప్రతి సినిమా కూడా విజయం సాధిస్తుంది.ఆమె కథలు ఎంచుకునే విధానం వల్లే ఆమెకి ఆ రేంజ్ విజయాలు దక్కుతున్నాయి.ప్రస్తుతం ఆమె చేసిన సినిమా ఓ బేబీ.కొరియన్ సినిమా మిస్ గ్రానీ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఓ బేబీ కి ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ దక్కింది.అలా మంచి అంచనాలమధ్య ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది.మరి బేబీ ఆ అంచనాలు అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఈ సినిమా కథ లోనే చిన్న సూపర్ ఫిషియల్ టచ్ ఉంది.70 ఏళ్ళ బామ్మ పాతిక సంవత్సరాల అమ్మాయిగా మారదాం అంటేనే కాస్త జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది.ఆ పాయింట్ ఎంత కన్వీన్సింగ్ గా చెప్పడానికి ట్రై చేసినా కూడా చిన్న డ్రమటిక్ టచ్ వస్తుంది.ఓ బేబీ విషయంలో కూడా ప్రేక్షకులు అది ఫీల్ అవుతారు.కాకపోతే బామ్మ అమ్మాయిగా మారడానికి కారణం టచింగ్ గా ఉండడం,అలా మారిన తరువాత జనరేట్ అయిన ఫన్,సెకండ్ హాఫ్ లో ఎమోషన్ అన్నీ కూడా బాగా వర్క్ అవుట్ అవ్వడం బేబీ కి ప్లస్ గా మారింది.ఫస్ట్ హాఫ్ వరకు ఫాస్ట్ ఫాస్ట్ గా,ఫన్ రైడ్ లా సాగిన బేబీ ప్రయాణం సెకండ్ హాఫ్ లో కాస్త నెమ్మదించినా మధ్య మధ్యలో వచ్చిన క్వాలిటీ ఎమోషన్స్,క్లయిమాక్స్ వల్ల సులభంగా పాస్ మర్క్స్ పడ్డాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

నటీనటులు:

ఈ సినిమా మొత్తాన్ని లక్ష్మి,సమంత ఇద్దరూ కూడా తమ నటనతో అలవోకగా నడిపించేసారు.సీనియర్ యాక్టర్ లక్ష్మి ఉన్నది కొద్దిసేపే అయినా,ఆమె నటన,దానికి తగ్గట్టు చిన్న యాసతో కూడిన ఓన్ డబ్బింగ్ బాగా సెట్ అయ్యాయి.ఇక సమంత అయితే బేబీ పాత్ర కోసం చాలా కేర్ తీసుకుంది.తన బోడి లేంగ్వేజ్ మార్చుకుంది.ఎక్స్ప్రెషన్స్ విషయంలో గానీ,బామ్మ పాత్ర కంటిన్యుటీ మైంటైన్ చెయ్యడంలోగానీ ఎక్కడ తడబడలేదు.ఇది సమంత కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ లో ఒకటి.రాజేంద్ర ప్రసాద్ కి కూడా మంచి పాత్ర దక్కింది.రావు రమేష్,ప్రగతి ల పాత్రలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి.అమ్మోరు సినిమాలో అమ్మోరుగా అలరించిన సునయన,చైల్డ్ ఆర్టిస్ట్ తేజ…ఈ ఇద్దరికీ ఓ బేబీ మంచి కమ్ బ్యాక్ మూవీ.నాగ శౌర్య గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు.ఇక జగపతి బాబు రోల్ సినిమాలో పెద్ద సర్ప్రైజ్.క్లయిమాక్స్ లో నాగ చైతన్య ఎంట్రీ మరింత సర్ప్రైసింగ్.కాకపోతే ఆ అతిధి పాత్రని కూడా కథకి కనెక్ట్ చేసారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

టెక్నీషియన్స్:

అలా మొదలైంది సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న నందిని రెడ్డి ఈ రీమేక్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంది.తెలుగుకి అవసరమయిన మార్పులు చేర్పులు చెయ్యడంలో నందిని రెడ్డి సక్సెస్ అయ్యింది.నమ్మశక్యం కాని పాయింట్ ని చాలా జాగ్రతగా,మెచ్యూర్డ్ గా డీల్ చేసింది.ఇక లక్ష్మి భూపాల మాటలు సినిమాకి బలంగా నిలిచాయి.కామెడీ,సెంటిమెంట్ పరిపూర్ణంగా పండాయి.మిక్కీ.జె.మేయర్ రీ రికార్డింగ్ కి ఫుల్ మార్క్స్ వెయ్యొచ్చు.పాటలు కాస్త ఎక్కువ అయ్యి అన్న ఫీలింగ్ కలుగుతుంది.టైటిల్ ట్రాక్ మాత్రం హమ్మింగ్ చేసేలా కనెక్టింగ్ గా ఉంది.రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది.విజువల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఫైనల్ గా:

దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ బేబీ ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా అప్పీల్ అయ్యే సినిమా.మిగతా వాళ్లకు కూడా నచ్చే అంశాలు ఉన్నాయి.కాకపోతే సి సెంటర్స్ లో ఈ సినిమా ఎంతవరకు ఫేర్ చేస్తుంది అనేది చూడాలి.మెయిన్ పాయింట్ లో కాస్త ఆర్టిషియాలిటీ ఉన్నా కూడా,సెకండ్ హాఫ్ కాస్త ల్యాగింగ్ గా ఉన్నా కూడా ఆ బలహీనతలు బేబీ విజయాన్ని ఆపగలిగేంత పెద్దవి కాదు.ఓవర్ ఆల్ గా బేబీ సక్సెస్ అందుకున్నట్టే.

 

[INSERT_ELEMENTOR id=”3574″]