Samantha Akkineni, Oh Baby Official Trailer, Film News,
Samantha Akkineni, Oh Baby Official Trailer, Film News,

సౌత్ ఇండియాలో ఈ మధ్యకాలంలో లేడి సూపర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్న నటి నయనతార.ఎలాంటి పాత్ర అయినా పోషించి మెప్పించగలగడం,సోలో సినిమాలతో కూడా సాలిడ్ వసూళ్లు సాధిస్తుండటంతో ఆమె ఆ ప్లేస్ కి పోటీలేని పర్మినెంట్ పార్టీసిపెంట్ గా నిలుస్తూ వచ్చింది.కానీ ఇప్పుడు సమంత రూపంలో ఆమెకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎదురయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఎంట్రీ ఇస్తూనే మొదటి సినిమాలోనే పెర్ఫార్మెన్స్ తో,అందంతో కట్టిపడేసిన సమంత ఆ తరువాత కమర్షియల్ హీరోయిన్ గా టర్న్ తీసుకుని ఇండస్ట్రీ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్ గా నిలిచింది.కానీ ఎక్కువగా గ్లామర్ ఓరియెంటెడ్ రోల్స్ కే పరిమితం అయ్యింది.పెళ్లయిన తరువాత ముగిసిపోతుంది అనుకున్న సమంత కెరీర్ అనూహ్యంగా నెక్ట్ లెవెల్ కి వెళ్ళింది.ఇప్పుడు మనం చూస్తున్నది సమంత రీ లోడెడ్ 2.0 వెర్షన్ అని చెప్పుకోవచ్చు.ఆమె మంచి నటి అని తెలుసుగానీ మరీ ఈ రేంజ్ లో సినిమాని నడిపించే సత్తా ఉంది అని ఇప్పుడే అర్ధమవుతుంది అందరికి.రంగస్థలం,మహానటి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో సైతం సమంత కి షేర్ ఉన్నా ఈ సంవత్సరం వచ్చిన హిట్స్ మాత్రం ఆమెకి చాలా స్పెషల్.

[INSERT_ELEMENTOR id=”3574″]

మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో సమంత షేర్ ఏంటి అనే ప్రశ్నకి సమాధానం ఆమె ఎంట్రీ కి థియేటర్స్ లో వినిపించిన విజిల్స్.ఇక ఇప్పుడు అయితే సమంత మెయిన్ ఎస్సెట్ గా తెరకెక్కిన ఓ బేబీ సినిమా సమంత స్టార్డం,స్టేచర్ తో పాటు నటిగా ఆమె స్టామినాని బాక్స్ ఆఫీస్ సాక్షిగా ప్రూవ్ చేసింది.మొదటి రోజు మెల్లగా టేక్ ఆఫ్ అయిన ఓ బేబీ,శని ఆది వారాల్లో హౌస్ ఫుల్స్ తో నడించింది.దీంతో ఫస్ట్ వీక్ ఎండ్ లో వరల్డ్ వైడ్ గా 17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సినిమా కొనుకున్న వాళ్ళందరిని సేఫ్ జోన్ లోకి తెచ్చేసింది.ఇక ప్రతిష్ఠాత్మక ఓవర్సీస్ లో మార్కెట్ లో కూడా ఏకంగా హాఫ్ మిలియన్ డాల్సర్ కొల్లగొట్టింది.సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఉండడంతో ఖచ్చితంగా 30 కోట్ల మార్క్ టచ్ చెయ్యడం గ్యారంటీ.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఆ రేంజ్ కలెక్షన్స్ అంటే సామాన్యుమైన విషయం కాదు.U టర్న్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గ్గర సత్తా చాటడంలో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయిన సమంత ఈసారి మాత్రం టార్గెట్ మిస్ కాలేదు.దీంతో తమిళ్ లో నయనతార నటించిన ‘ఆరమ్’ సినిమా సీక్వెల్ లో సమంత ని ఫైనల్ చేసుకున్నాడట డైరెక్టర్.ఓ బేబీ లో ఆమె మెచూర్డ్ నటన చూసిన తరువాత ఇది కరెక్ట్ డెసిషన్ అనిపిస్తుంది.అయితే ఆ సినిమా తెలుగు వెర్షన్ కర్తవ్యం అనుకున్నంతగా ఆడలేదు.కానీ ప్రస్తుతం సమంత కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ సీక్వెల్ ఇక్కడ కూడా బాక్స్ ఆఫోస్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా నిలిచింది సమంత.

[INSERT_ELEMENTOR id=”3574″]