Samantha health issues: గత కొద్ది రోజులుగా సమంత హెల్త్ ఇష్యూ మీద మీడియాలో చాలా కథనాలు వచ్చాయి అయితే వీటి పైన ఎటువంటి అధికారికంగా ఎవరూ నోరు విప్పలేదు. ఈరోజు సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు అలాగే త్వరలోనే కోరుకుంటానని రెడీ చేయడం జరిగింది.
Samantha Diagnosed with Myositis: సమంత యశోద మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. యశోద సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రెండు రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. సమంత ఫాన్స్ దగ్గర్నుంచి అలాగే మూవీ వ్యవస్థ గురించి అనూహ్యమైన స్పందన వచ్చింది ట్రైలర్ కి.
అయితే ఈ రోజు యశోద ఈ సినిమాకి డబ్బింగ్ చెబుతూ తన సోషల్ మీడియా ద్వారా తను బాధ పడుతున్న వ్యాధి గురించి చెప్పు కు రావడం జరిగింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్న సామ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా తను ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ లో తను ఇలా రాయటం జరిగింది.

“యశోద ట్రైలర్‌కు మీ స్పందన బాగుంది. మీ అందరితో నేను పంచుకునే ఈ ప్రేమ, అనుబంధమే జీవితం నాపై విసిరే సవాళ్లను ఎదుర్కోడానికి రక్షణ ఇస్తుంది. కొన్ని నెలల నుంచి నేను మయాసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండీషన్‌తో బాధపడుతున్నాను. ఈ పరిస్థితి నుంచి కోలుకున్న తర్వాత మీతో పంచుకుందామని అనుకున్నా. కానీ ఇది నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తోంది. మనం ఎల్లప్పుడూ బలమైన ముందడుగు వేయాల్సిన అవసరం లేదని నిదానంగా గ్రహించాను. ఈ పరిస్థితిని అంగీకరించడానికి నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నాకు మంచి, చెడు రోజులు వచ్చాయి. శారీరకంగా, మానసికంగా వీటిని నేను హ్యాండిల్ చేయలేనని అనిపించినప్పుడు కూడా ఏదోక విధంగా సమయం గడిచిపోయింది. నేను కోలుకునే రోజు దగ్గరగా ఉందని ఆశిస్తున్నాను. నేను ఎల్లప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను.”
దీనికి సంబంధించి సినిమా పెద్దలు అలాగే సమంత ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా వాళ్ల ప్రేమని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమంత నటించిన యశోద సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. సినిమాతో పాటు బాలీవుడ్ కు సంబంధించిన సినిమాలు కూడా సమంతా చేస్తుంది.