Samantha Gets Emotional about her Health Problem: సమంత గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సమంత ఇప్పుడు యశోద (Yashoda Movie) అనే సినిమాతో మన ముందుకు వస్తుంది. యశోద సినిమాని ఈ నెల 11న విడుదల చేయుటకు సిద్ధం చేశారు.
యశోద సినిమాకు సంబంధించి సమంత ప్రమోషన్ సంబంధించిన ఇంటర్వ్యూల్లో చురుగ్గా పాల్గొంటోంది. అయితే సమంత మైయోసిటిస్ అనేది ఈ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మైయోసిటిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి. సాధారణంగా ఇది కండరాల వాపు ద్వారా వర్గీకరించబడుతుంది.
యశోద సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఇంటర్వ్యూలో సమంత తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే మీడియాలో వస్తున్న పలు ప్రచారం చూసి తను ఇంకా చదవలేదు అంటూ కామెంట్ చేయడం కూడా జరిగింది. అయితే తాము ఈ పరిస్థితి నుంచి త్వరగా కోలుకుంటారని తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది.