Samantha Social media post Viral: సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా అలాగే తన పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉండేది. నాగచైతన్య తో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బాగుంటది అనుకున్న ఫ్యాన్స్ అందరూ ఆ తర్వాత విడాకులు, మరో వైపు మయోసిటీస్ అనే అరుదైన వ్యాధి తో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తన సోషల్ మీడియాలో ప్రేమ గురించి ఒక పోస్ట్ చేయటం ద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చింది సమంత.
Samantha Social media post Viral: మ్యారేజ్ చేసుకున్న తర్వాత మొదటిసారిగా సోషల్ మీడియాలో ప్రేమ గురించి సమంతా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది చూసిన వారంతా మళ్లీ సమంతా ప్రేమగా పడిందా అనే విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య సినిమాల ప్రస్థానంలో విరామం లేకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈమధ్య హీరోయిన్ శోభిత ధూళిపాళ తో ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ సోషల్ మీడియాలో పుకార్లు అయితే కొనసాగాయి.
ఇక సమంతా (Samantha) కూడా ప్రేమలో (Love) పడింది అంటూ.. రెండో పెళ్ళికి రెడీ అయింది అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. అయితే ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవన్నీ పుకార్లు అంటూ తోసుకు వచ్చింది సమంత. ఇదిలా ఉంటే సమంతా రీసెంట్ గా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. సామ్ స్వయంగా పోస్ట్ చేసిన ఈ న్యూస్ అందరినీ ఆకర్షిస్తుంది.ఆ పోస్ట్ చూస్తుంటే సామ్ ప్రేమలో ఉందా అనే అనుమానాలు కలుగక మానవు.

అందుకే ఆమె ప్రేమలో పడిందా లేకా ప్రేమలో పడాలనుకుంటుందా అంటూ ఎవరికి తోచినట్లు వారు ఊహించేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ మధ్యనే విడుదలైన శకుంతల సినిమా సమంతకి నిరాశపరిచింది. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో చేస్తున్న సమంత, తన ఆశల మొత్తం ఈ సినిమా పైన పెట్టుకుంది. ఇది ఈ సినిమా తర్వాత సమంత ఒక వన్ ఇయర్ పాటు షూటింగ్ లకు దూరంగా ఉండి తన ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు కింద వీడియోలో మీకోసం.