Samantha rank in IMDB list: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం నటనతో అభిమానులను అలాగే మూవీ లవర్స్ ని మంత్రపుతుందో చేస్తుంది. చిన్న అలాగే పెద్ద హీరోలు అని లేకుండా అందరితో నటించిన సమంత ఇప్పుడు IMDB list లిస్టులో టాప్ హీరోలను దాటి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళింది.
Samantha rank in IMDB list: సమంత ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీస్ అలాగే ఎక్కువ వెబ్ సిరీస్ చేస్తుంది. రీసెంట్ గా వచ్చిన శాకుంతలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో సమంతా కి గట్టిగానే షాక్ తగిలింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తన పాపులారిటీకి మాత్రం ఎటువంటి డామేజ్ కాలేదు. ఇక విషయానికి వెళ్తే, IMDB టాప్ సెలబ్రిటీ లిస్టు ని విడుదల చేయడం జరిగింది. దీనిలో సమంత నెంబర్ వన్ పొజిషన్లో ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి కలగజేసింది. ఆ లిస్టు ఏంటో ఓసారి చూద్దాం.
ఆర్మాక్స్ లిస్టులో సమంత (Samantha) వరుసగా ఏడుసార్లు టాప్ లిస్టులో ఉండగా ఇప్పుడు IMDB విడుదల చేసిన టాప్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులో మొట్టమొదటిసారిగా మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో షారుఖ్, సల్మాన్, అల్లు అర్జున్ (Allu Arjun) కూడా దాటేసింది. గత రెండు వారాల్లో 9వ స్థానంలో ఉన్న సమంత ఈ వారం ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది.
దీనిని బట్టి సమంత (Samantha) పాపులారిటీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ ఖాన్ 2 స్థానంలో.. షారుఖ్ ఖాన్ మూడవ స్థానంలో ఉనారు. ఇదే లిస్టులో మన సౌత్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hedge) 5వ స్థానంలో నిలిచింది. పుష్ప సినిమాతో ఇటు సౌత్ అలాగే నార్త్ లోను మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ మాత్రం 17వ స్థానంలో ఉండాల్సి వచ్చింది. సమంతా మాత్రం తన సినిమాల ఫ్లాప్ అలాగే హిట్ తో సంబంధం లేకుండా ఫాలోయింగ్ పెంచుకుంది.
ప్రస్తుతం సమంత సిటడెల్ వెబ్ సిరీస్ సౌత్ ఇండియా వర్షంలో నటిస్తుంది. సమంత ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన లండన్ లో ప్రీమియర్ షో కూడా వెళ్లడం జరిగింది. ఈ ప్రీమియర్ షో కాను సమంత ఏకంగా రూ.6 కోట్లు విలువైన జువెలరీతో మెరిసిపోయింది.