Samantha Akkineni: Rakul Drugs Racket:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని వణికిస్తున్న డ్రగ్స్ కేసుపై ఎన్సీబీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ కూడా ఉన్నారని వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ అసలు విషయం చెప్పింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో డ్రగ్స్ కోణం ఉన్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇటీవల సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, శామ్యూల్ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, విచారణ చేస్తోంది. అంతేకాదు 14 రోజుల కస్టడీలో ఉన్న రియా 20 పేజీల వివరణాత్మక స్టేట్మెంట్ను ఎన్సీబీకి అందించారని, అందులో డ్రగ్స్ తీసుకుంటున్న 25 మంది సెలబ్రిటీల పేర్లను వెల్లడించారని ప్రచారం జరిగింది. ఎన్సీబీకి అందించిన పత్రాల్లో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అనేక వెబ్సైట్లు కథనాలు రాయడంతో శనివారం రకుల్‌ప్రీత్‌పై నెటిజన్లు అనేక కామెంట్లు చేశారు.
ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ డ్రగ్స్ విషయమై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు. ఇప్పటివరకు రియా కేవలం డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని, 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ పెడల్స్‌తో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన పేర్కొన్నాడు. ఇక డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఇందులో లేవని చెబుతూ సంచలన విషయం బయటపెట్టారు.
దీంతో రకుల్, సారా తప్పు లేదని తెలుసుకున్న నెటిజన్లు ‘సారీ రకుల్’, ‘సారీ సారా’ అని పోస్ట్‌లు చేస్తున్నారు. నటి సమంత కూడా అందరి తరఫున క్షమాపణలు చెప్పారు.