Homeసినిమా వార్తలుసామంత శాకుంతలం సినిమా విడుదల వాయిదా.. కారణం ఇదే..!

సామంత శాకుంతలం సినిమా విడుదల వాయిదా.. కారణం ఇదే..!

Shaakuntalam Release Date: వైవిధ్య సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి ప్రత్యేక స్థానం ఉంది టాలీవుడ్ లో. ఇప్పుడు గుణశేఖర్ శాకుంతలం అనే సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సమంత (Samantha) ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది.

సమంత (Samantha) ప్రధాన పాత్రలో చేస్తున్నా శాకుంతలం (Shaakuntalam) సినిమా ని చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈరోజు శాకుంతలం సినిమా విడుదల వాయిదా గురించి దర్శకుడు గుణశేఖర్ తన ట్విట్టర్ వేదికగా ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేయడం జరిగింది.

సమంత శాకుంతలం (Samantha Shaakuntalam) సినిమాను 3Dలో ఆందించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు గుణశేఖర్. దీని గురించి విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఏమన్నారంటే.. ‘‘అత్యంత భారీ స్థాయిలో, అత్యద్భుతంగా శాకుంతం చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. అందుకే, ఇంతకు ముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం.

ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం’’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది.

Samantha next movie Shaakuntalam Release Date postponed
Samantha next movie Shaakuntalam Release Date postponed

స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.

Related Articles

Telugu Articles

Movie Articles