Samantha ad shoot Photos Viral: సౌత్ సినిమా ఇండస్ట్రీలో సమంత తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సమంత అటు పెద్ద హీరోలతో అలాగే బి గ్రేడ్ హీరోలతో కూడా నటించింది. ఇండస్ట్రీకి ఎంతమంది హీరోయిన్స్ వస్తున్నప్పటికీ సమంతా ప్లేస్ లో ఎటువంటి మార్పు రాలేదు. సినిమా ఇండస్ట్రీలో 13 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది సమంత. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత కోల్కొని ఇప్పుడు తన రాబోయే సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటుంది.
Samantha ad shoot Photos Viral: సినిమాని అమితంగా ప్రేమించే సమంత.. దర్శకుడు కోరిన విధంగా తన మేకోవర్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. సినిమాకు తగ్గట్టు యాక్షన్స్ అలాగే రొమాన్స్ లో ను తన సాటి ఎవరూ రారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ అలాగే యాక్షన్ మూవీస్ సంబంధించిన సినిమాలను చేస్తుంది. వీటి కోసమని సమంత చాలానే కష్టపడుతున్నారు.
ది ఫ్యామిలీ మెన్ అలాగే యశోద సినిమాలలో తన యాక్షన్స్ సన్నివేశాలను మనం చూడవచ్చు. ప్రస్తుతం సమంత హాలీవుడ్ లో తెరకెక్కిన ఒక వెబ్ సిరీస్ నీ రాజ్ అండ్ డీకే దర్శకులు రీమేక్ లో నటిస్తుంది. రీసెంట్ గా ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ వరల్డ్ ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు గాను సమంత లండన్కు వెళ్లిన విషయం కూడా తెలిసిందే. సమంత సినిమాలతో పాటు కొన్ని పాపులర్ బ్రాండ్స్ నీ ప్రమోట్ చేస్తుంది.
సమంత (Samantha) కెరీర్ లో చాలా బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేసింది అలాగే ఇప్పుడు అంతర్జాతీయ దిగ్గజం పెప్సీ కోసం సామ్ పనిచేస్తున్నారు. ఈ యాడ్ కి సంబంధించిన షూట్ లో సమంతా ఈరోజు పాల్గొన్నారు వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు.. ఈ యాడ్ కోసం స్టంట్స్ షూట్ చేస్తున్న ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన ఫాన్స్ అలాగే ఫాలోవర్స్ యాడ్ కోసమే ఇంతలా కష్టపడితే.. యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన సిటాడెల్ కోసం ఇంకెంత కష్టపడిందోనని కామెంట్స్ చేయడం జరుగుతుంది.