‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ రిలీజ్.. ఇరగదీసిన సమంత..!

Family Man Season 2 Trailer: ”ది ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ ద్వారా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీరీస్ కు కొనసాగింపుగా ఇది తెరకెక్కింది. నిజానికి ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదలకు రెడీ అయింది కానీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తుంటే ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1 కంటే సీజన్ 2 మరింతగా ఉత్కంఠభరితంగా రూపొందించినట్లు తెలుస్తోంది. మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణిలతో పాటు సమంత అక్కినేని ఈ ట్రైలర్‌లో కనిపించారు. డీ గ్లామర్ అండ్ నెగిటివ్ రోల్‌లో సమంత కనిపిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మ‌నోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్ అనే పాత్ర‌లో క‌నిపించ‌గా, సమంత సూసైడ్‌ బాంబర్‌గా కనిపించింది.

Read Also: ప్రభాస్ డ్యుయెల్ రోల్.. ఓ పాత్రలో ఆర్మీ ఆఫీసర్​గా 

సమంత ఇప్పటి వరకు పోషించని టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్ బాంబర్ గా కనిపించి షాక్ ఇచ్చింది. డీగ్లామర్ లుక్ లో కనిపించిన సామ్.. వాళ్లను నేను చంపేస్తా అంటూ తమిళంలో సవాలు విసురుతోంది. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొన్న సమంత.. నెగిటివ్ రోల్ లో యాక్టింగ్ ఇరగదీసినట్లు అర్థం అవుతుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Read Also: తమన్నా ‘నవంబర్ స్టోరీ’ ట్రైలర్

 

- Advertisement -

Watch Samantha The Family Man Season 2 Trailer

 

Related Articles

Telugu Articles

Movie Articles