Samantha Akkineni Next Movie Details
Samantha Akkineni Next Movie Details

ప్రస్తుతం సమంత కెరీర్ లోనే టాప్ ఫామ్ లో ఉంది.ఇక సమంత రిటైర్ అయిపోతుంది అని సెటైర్ వేసినోళ్లు కూడా మొలలు వెళ్ళబెట్టి చూసేలా వరుస హిట్స్ అందుకుంటుంది.ఈ సంవత్సరమే రెండు బ్లాక్ బస్టర్స్ అందించింది.రెండూ నిర్మాతలకు,సినిమా కొనుక్కున్న ప్రతి ఒక్కరికి లాభాలు తీసుకొచ్చాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఆమె నాగ చయతన్యతో కలిసి నటించిన మజిలీ ఈ రోజుతో 100 రోజులు పూర్తిచేసుకుంది.అసలు స్టార్స్ సినిమాలే థియేటర్ లో 100 రోజులు ఆడడం గగనంగా మారిన టైం లో సమంత నటించిన మజిలీ 100 రోజులు రన్ అవడం చూస్తే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.సమంత నటించిన ఓ బేబీ కూడా థియేటర్స్ లో మేజర్ ఆక్యుపెన్సీ తో రన్ అవుతుంది.ఫస్ట్ వీకెండ్ లో పెట్టినపెట్టుబడులు రాబట్టిన బేబీ వసూళ్లు ఇంకా గ్రాండ్ గానే ఉన్నాయి.వీకెండ్స్ లో అయితే హౌస్ ఫుల్ పడుతున్నాయి.అయితే ఇది కొరియన్ సినిమా మిస్ గ్రానీ కి రీమేక్.తెలుగుకి వర్క్ అవుట్ కాదు అనుకున్న ఈ సినిమాని సమంత పట్టుదలగా ప్రయత్నించి హిట్ గా నిలపడానికి అన్ని విధాలుగా ట్రై చేసింది,సక్సెస్ అయ్యింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

గతంలో సమంత నటించిన U టర్న్ కూడా సమంత పెర్సనల్ గా కనెక్ట్ అయ్యి చేసిన రీమేక్.ఆ సినిమా కూడా మరీ కోట్లకు కోట్లు కొల్లగోట్టకపోయిన మంచి లాభాలు తీసుకొచ్చింది.U టర్న్ కన్నడ మూవీ,మిస్ గ్రానీ కొరియన్ మూవీ లను రీమేక్ చేసి రెండు విజయాలు అందుకున్న సమంత ఇప్పుడు మరొక సినిమా రీమేక్ చేసేందుకు రెడీ అయ్యింది.ఓ బేబీ లో ఎమోషన్ ఉన్నా కూడా సమంత చేసిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.అందుకే ఫ్రెంచ్ లో హిట్ అయిన ఒక కామెడీ మూవీ ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ సినిమా కథ కూడా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది.సో,సమంత అనే బ్రాండ్ నేమ్ తోనే హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది.ఆ సినిమాతో కూడా హిట్ కొట్టి రీమేక్ సీనియాలతో హ్యాట్రిక్ కొట్టిన ఘనత సాధించడానికి రెడీ అవుతుంది సమంత.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఆగష్టు లో వస్తున్న మన్మధుడు-2 లో కూడా ఒక కీలకపాత్ర పోషించింది సమంత.మరొక సినిమాని రీమేక్ చేస్తే అది నాలుగో సినిమా అవుతుంది.అంటే ఒకే సంవసతరంలో నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్ గా కూడా ఆమెకి క్రెడిట్ దక్కుతుంది.మొత్తానికి సమంత సూపర్ ఫామ్ ఇప్పటిలో డౌన్ అయ్యే అవకాశం అయితే లేదు.