Samanthas Akkineni Latest Workouts Video Goes Viral

Samantha Workout Video: కొద్దిరోజులుగా అక్కినేని వారి కోడలు సమంత పేరు మార్మోగిపోతోంది. హీరోయిన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సమంత తొలిసారి బిగ్‌బాస్‌ 4కు హోస్ట్‌గా చేసి అందరినీ ఫిదా చేసేసింది. దీంతో పాటు ఆహా యాప్ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షోని హోస్ట్ చెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించింది. హీరోయిన్స్ ఫిట్ గా ఉండేందుకు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవ్వాలంటే వరుసగా ఆఫర్లు దక్కించుకోవాలి. అలా వరుస ఆఫర్ల కోసం ఫిట్ గా ఉండటం తప్పనిసరి. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే సమంత గతంలో జిమ్‌లో వంద కేజీల బరువును కూడా అవలీలగా మోసిన వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

‘సామ్ జామ్‌’ షోతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు సమంత బాగా కష్టపడుతోంది. దీనిలో భాగంలోనే ఇటీవల ప్లాంట్ బేస్డ్‌ డైట్‌తో పాటు దానికి సంబంధించి వర్కౌట్స్‌ మొదలుపెట్టింది. ట్రైనర్ కృష్ణ వికాస్ పర్యవేక్షణలో సామ్ ఈ కఠిన వ్యాయామాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సమంత పడుతున్న కష్టం కనిపిస్తుంది. సాదారణంగా ఇలాంటి వర్కౌట్స్ చేయాలంటూ చాలా స్టామినా ఉండాలి. ఒక్క చేయిపై బాడీని బ్యాలన్స్ చేస్తూ మూమెంట్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సమంత డెడికేషన్‌కు, ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CHZUkhshQgR/?utm_source=ig_web_copy_link