నితిన్ “మాచర్ల నియోజకవర్గం” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

0
2307
Samuthirakani in a dual role in Nithiin Macherla Niyojakavargam

Nithiin Macherla Niyojakavargam: నితిన్ కెరీర్ లో 31వ సినిమాగా మాచర్ల నియోజకవర్గం సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసుకోనుంది.

అయితే ఈ చిత్రం పై ఇప్పుడు ఓ ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని (Samuthirakani) కూడా నటిస్తున్నాడని ఈ వార్త సారాంశం. ఈయన నటిస్తున్నాడంటేనే కీలక పాత్ర అయి ఉంటుంది. అంతే కాకుండా తన రోల్ డ్యూయల్ రోల్ గా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

తండ్రి మాచర్ల నుండి ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు, అతను ఒక నితిన్ చే సవాలు చేయబడే వరకు ఎన్నికల్లో పోటీ లేకుండా గెలుస్తాడు, కొడుకు పాత్ర తన తండ్రి కోరికలను నెరవేర్చడమే సెకండ్ రోల్.

Samuthirakani in a dual role in Nithiin Macherla Niyojakavargam

మరి ఈ సినిమాలో మూవీ లవర్స్ లో ఎలాంటి ట్రీట్ ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

 

Previous articleఅపోలో వైద్యులు సాయి ధరమ్‌ తేజ్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల..!
Next articleథ్యాంక్స్ సామ్.. చైతూ ట్వీట్ వైరల్‌..!