పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంయుక్త (Samyuktha Menon) ఎప్పుడూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావటంతో దర్శకులు అలాగే ప్రొడ్యూసర్లు సంయుక్త డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. బింబిసారా, ధనుష్ సార్ మూవీ వంటి చిత్రాలతో హిట్టు అందుకున్న కేరళ కుట్టి రీసెంట్గా సాయిధరమ్ తేజ్ విరుపాక్ష మూవీతో మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.
టాలీవుడ్ లో (Tollywood) క్రేజీ హీరోయిన్ గా మారిన సంయుక్త కి(Samyuktha Menon) ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే సంయుక్త కి మరో తెలుగు సినిమా ఆఫర్ కొట్టేసింది.. అది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీని తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు సోషల్ మీడియాలోనే కాకుండా వెబ్ మీడియాలో కూడా చాలానే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ సినిమా కోసం హీరోయిన్ సంయుక్త (Samyuktha Menon) హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే మళ్లీ త్రివిక్రమ్ అలాగే హీరోయిన్ సంయుక్త (Samyuktha Menon) రిలేషన్ పై గుసగుసలు వినపడుతున్నాయి. ఒకప్పుడు వీరి మధ్య రిలేషన్ ఉంది అంటూ చాలానే వార్తలు ప్రచారం జరిగాయి. ప్రస్తుతం హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రాబోయే డెవిల్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది. అల్లు అర్జున్ అలాగే సంయుక్త సినిమాపై జరుగుతున్న ఈ ప్రచారంపై సినీ వర్గాల వారు ఎలా స్పందిస్తారో చూడాలి..