సానా కష్టం ఐటెం సాంగ్: చిరు నుండి మాస్ నంబర్

Acharya Saana Kastam Song: మెగాస్టార్ చిరంజీవి అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆచార్య (Acharya). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య (Acharya) సినిమాలో లో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా చేస్తుంది. అలాగే రామ్ చరణ్ (Ram Charan) జోడిగా పూజ హెగ్డే చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన నా సాంగ్స్ అలాగే టీచర్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆచార్య నుండి ఐటమ్ సాంగ్ (Saana Kastam Item song) ని రిలీజ్ చేశారు మేకర్స్. సానా కష్టం (Saana Kastam) వచ్చిందే మందాకిని అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ రెజీనా (Regina) చిరంజీవితో కలిసి స్టెప్పులేయడం విశేషం.

మణిశర్మ సంగీతం అందించిన ఈ పార్టీ సాంగ్‌లో చిరంజీవిని చూడటం చాలా ఆనందంగా ఉంది. రెజీనా(Regina) తన సెన్సాఫ్ స్టెప్పులతో మరో హైలైట్‌గా నిలిచింది. ఈ సాంగ్ కి మెగా అభిమానులను థియేటర్లలో డ్యాన్స్ చేయడం ఖాయం. ఈ పాటను భాస్కర్ భట్ల రచించగా సింగర్ రేవంత్ గీతామాధురి ఆలపించారు.

Saana Kastam Lyrical song release from Chiranjeevi Acharya
Saana Kastam Lyrical song release from Chiranjeevi Acharya

తన సినిమాలలో మాస్ నంబర్స్‌తో పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివతో కలిసి రావడం ఆన్‌స్క్రీన్ మ్యాజిక్‌ని సృష్టించింది.కొరటాల శివ రచన మరియు దర్శకత్వం వహించిన ఆచార్య (Acharya) ఫిబ్రవరి 4, 2022 న విడుదల కానుంది. ‘మెగాస్టార్’ చిరంజీవి (Chiranjeevi) మరియు ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ (Ram Charan) కలయికలో వచ్చిన ఈ చిత్రం భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. అలాగే చిరంజీవి, కొరటాల శివ కలయికలో ఇదే తొలిసారి.

Related Articles

Telugu Articles

Movie Articles